బీఎండబ్ల్యూ ‘ఎక్స్‌3’లో కొత్త వెర్షన్‌

20 Apr, 2018 00:17 IST|Sakshi

ప్రారంభ ధర రూ.49.99 లక్షలు

న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా తన ప్రముఖ ఎస్‌యూవీ ‘ఎక్స్‌3’లో కొత్త వెర్షన్‌ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.49.99 లక్షలు– రూ.56.7 లక్షల శ్రేణిలో ఉంది. కొత్త ఎక్స్‌3ని ఆన్‌రోడ్, ఆఫ్‌రోడ్‌ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించామని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పవా తెలిపారు. ‘ఎక్స్‌3లో 2 లీటర్‌ 4 సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చాం. 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ను పొందుపరిచాం.

ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని 8 సెకన్లలో అందుకుంటుంది’ అని వివరంచారు. అలాగే ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, డైనమిక్‌ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్‌ బ్రేక్‌ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రిక్‌ పార్కింగ్‌ బ్రేక్, సైడ్‌ఇంపాక్ట్‌ ప్రొటెక్షన్, క్రాష్‌ సెన్సార్‌ వంటి పలు భద్రతా ఫీచర్లు ఉన్నాయని తెలిపారు. 

మరిన్ని వార్తలు