హోండా ఫోర్జా 125 డబుల్‌ పవర్‌తో

5 Jun, 2018 18:17 IST|Sakshi

హోండా ఫోర్జా 125 2018

యాక్టివాకు డబుల్ పవర్

సాక్షి,ముంబై: హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ సరికొత్త యాక్టివాను లాంచ్‌ చేయనుంది. హోండా స్కూటర్లతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్‌ అయిన హోండా ఇపుడు కొత్త అప్‌డేటెడ్‌ స్కూటర్‌ను తీసుకు రానుంది. హోండా ఫోర్జా 125 లో  న్యూ జనరేషన్‌ టూవీలర్ ను ఆవిష్కరించనుంది. తమ తాజా స్కూటర్‌ దాదాపు హోండా యాక్టివాకు డబుల్ పవర్ కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. రెండు ఫుల్‌ ఫేస​ హెల్మెట్స​ కొత్త వెర్షన్‌ ఫోర్జా సీటు కింద సరిపోతుందని,  స్మార్ట్ కీ ఆపరేటెడ్ 45 లీటర్ టాప్ బాక్స్ సామర్ధ్యం పెరుగుతుందని చెబుతోంది.

హోండా ఫోర్జా డిజైన్ , ఎలక్ట్రానిక్ డివైజ్ లో మార్పులతోపాటు మరికొన్ని హంగులతో మార్కెట్ లోకి విడుదల చేయనుంది. అయితే ఇంజిన్, చాసెస్ లో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా ఉంచింది. ఒకసారి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయిస్తే 486 కి.మీ. ప్రయాణించవచ్చని హోండా కంపెనీ చెబుతోంది. హోండా ఫోర్జాకు 125 సీసీ కెపాసిటీ సింగిల్‌ ఇంజిన్ అమర్చారు. 8750 ఆర్‌పీఎం వద్ద 14.75 బీహెచ్‌పీని, 8250 ఆర్‌పీఎం వద్ద 12.5 ఎన్‌ఎం టార్క్‌ను ప్రొడ్యూస్‌ చేస్తుంది. డిజిటల్ డిస్‌ప్లేతోపాటు అనలాగ్ స్పీడోమీటర్, టాకోమీటర్‌ ఇన్‌స్ట్రుమెంటల్‌ క్లస్టర్‌లో పొందుపర్చింది. ఇంకా కొత్త తరం హోండా ఫోర్జాలో అడ్జెస్టబుల్ విండ్ స్క్రీన్ , ఎల్ ఈ డీ ఇండికేటర్స్ , క్లస్టర్, అనలాగ్ స్పీడో మీటర్ అదనంగా జోడించింది. హ్యాండిల్ బార్ ను అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవచ్చని కంపెనీ చెబుతోంది. 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో హోండాకు యాక్టివా , గ్రాజియా పాపులర్‌ మోడల్స్‌. అయితే మ్యాక్సీ-స్కూటర్ డిజైనర్‌ కలిగి ఉన్నది మాత్రం హోండా ఫోర్జా. అలాగే యాక్టివా పోలిస్తే యాక్టివా 125 8.5 బీహెచ్‌పీ అని అందిస్తోంటే...ఫోర్జా 14.75 పవర్‌ను అందిస్తుంది. ​కాగా యూరప్‌లో   చాలా పాపులర్ అయిన ఈ స్కూటర్‌  2015లో సుమారు 30వేల యూనిట్లను విక్రయించిందట కంపెనీ.  అయితే  ధర వివరాలు, ఎపుడు లాంచ్‌ చేసేది అధికారికంగా వెల్లడించలేదు.

మరిన్ని వార్తలు