10 వేరియంట్లలో హ్యుందాయ్‌ గ్రాండ్ ఐ10 నియోస్‌

7 Aug, 2019 19:18 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ రెండవ అతిపెద్ద ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యుందాయ్‌  త్వరలో లాంచ్‌ చేయనున్న గ్రాండ్‌ ఐ10 నియోస్‌ 2019ని బుధవారం ప్రటకించింది. 3వ జనరేషన్‌  ఐ10 బుకింగ్స్‌ ను ప్రారంభించింది. కేవలం రూ.11 వేలకు ఈ కారును  ప్రీ బుకింగ్‌ అవకాశాన్ని కల్పిస్తోంది.  గ్రాండ్ ఐ 10 నియోస్ పది వేరియంట్లలో, ఆగస్టు 20న భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. డెలివరీలు ఈ నెలాఖరులో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

హ్యుందాయ్‌ కొత్త కారులో ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌ను పూర్తిగా మార్చేసింది. దీంతోపాటు యాపిల్‌ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో వంటి ఇన్‌ఫోటైమెంట్‌ ఫీచర్లను జతచేర్చింది. బీఎస్‌-6 నిబంధనల కనుగుణంగా 1.2-లీటర్ పెట్రోల్ డీజిల్ ఇంజన్లతో ఇది లాంచ్‌ చేయనుంది. ప్రస్తుతం వున్న 4 స్పీడ్‌కు బదులుగా..5-స్పీడ్ మాన్యువల్ లేదా ఎఎమ్‌టి గేర్‌బాక్స్‌తో రానుంది. గ్రాండ్ ఐ 10 నియోస్ పెట్రోల్ బేస్ వేరియంట్‌ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. మాగ్నా,  స్పోర్ట్జ్ వేరియంట్లలో ఆప్షన్‌గా కంపెనీ  ఏఎంటీ గేర్‌బాక్స్‌ను అందిస్తుంది. 

గత 21 ఏళ్లుగా  ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందిస్తున్న హ్యుందాయ్‌ సరికొత్త సాంకేతికతతో భారతీయ ఆటో పరిశ్రమలో హ్యుందాయ్‌ ఆటోమొబైల్‌ పలు సరికొత్త కొలమానాలను సృష్టించిందని  హ్యుందాయ్‌  సీఎండీ ఎస్‌ఎస్‌ కిమ్‌ వెల్లడించారు.  కొత్త గ్రాండ్ ఐ 10 నియోస్ మా మార్కెట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు ఫోర్డ్ ఫిగో వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. 

మరిన్ని వార్తలు