విటారా బ్రెజా కొత్త వేరియంట్‌

25 Feb, 2020 08:29 IST|Sakshi
విటారా బ్రెజా పెట్రోల్‌ వేరియంట్‌

విటారా బ్రెజాలో పెట్రోల్‌ వేరియంట్‌ 

ధరలు రూ.7–11 లక్షల రేంజ్‌లో  

ఏఎమ్‌టీ వెర్షన్‌ కూడా లభ్యం

దశలవారీగా డీజిల్‌ వేరియంట్‌ ఉపసంహరణ  

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ తన పాపులర్‌ ఎస్‌యూవీ మోడల్, విటారా బ్రెజాలో పెట్రోల్‌ వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధరలు రూ.7.34 లక్షల నుంచి రూ.11.4 లక్షలు (ఎక్స్‌ షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో నిర్ణయించామని మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. బీఎస్‌–సిక్స్‌ పెట్రోల్‌ విటారా బ్రెజాను 1.5 లీటర్‌ కె–సిరీస్‌ ఇంజిన్‌తో రూపొందించామని పేర్కొన్నారు. పెట్రోల్‌ వేరియంట్‌లో  5 గేర్లు(మాన్యువల్‌) వెర్షన్‌తో పాటు ఏఎమ్‌టీ(ఆటోమేటిక్‌ ట్రాన్సిషన్‌)ను కూడా అందిస్తున్నామని తెలిపారు.  

డీజిల్‌ కార్లకు టాటా...
ఈ కొత్త విటారా బ్రెజాకు వినియోగదారుల నుంచి మంచి స్పందనే లభించగలదన్న ధీమాను కెనిచి అయుకవ వ్యక్తం చేశారు. బీఎస్‌–సిక్స్‌ పర్యావరణ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానుండటంతో డీజిల్‌ ఇంజిన్‌ కార్ల ఉత్పత్తి నుంచి వైదొలుగుతున్నామని తెలిపారు. విటారా బ్రెజాలో డీజిల్‌ వేరియంట్‌ను దశలవారీగా ఉపసంహరిస్తామని వివరించారు. 2016లో విటారా బ్రెజా (డీజిల్‌) మోడల్‌ను మారుతీ సుజుకీ కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. అనతికాలంలోనే యుటిలిటి వెహికల్‌ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకూ ఐదు లక్షల విటారా బ్రెజాలు అమ్ముడయ్యాయి.

మరిన్ని వార్తలు