మోడ్రన్‌ ఫీచర్స్‌తో టీవీఎస్‌ స్కూటీ పెప్‌ ప్లస్‌

27 Sep, 2019 11:21 IST|Sakshi

పాతికేళ్ల సంబరం : టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ కొత్త ఎడిషన్‌

ధర   రూ. 44,764 (ఎక్స్-షోరూం, న్యూఢిల్లీ)  

 సాక్షి, న్యూఢిల్లీ:  టీవీఎస్‌ మోటార్‌ తన పాపులర్‌ మోడల్‌ స్కూటీపెప్‌ లో కొత్త  ఎడిషన్‌ను లాంచ్‌  చేసింది. తన స్కూటీ బ్రాండ్‌కు 25 సంవత్సరాల పూర్తైన సందర్భంగా కొత్త అపడేట్స్‌తో సరికొత్తగా టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 44,764 (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) గా నిర్ణయించింది. మాటే ఎడిషన్‌ను రెండు రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

3డీ ఎంబ్లం, ప్రెష్‌  గ్రాఫిక్స్‌, సీట్ల మార్పు తదితర రిఫ్రెష్ లుక్‌లో స్వల్ప మార్పులు తప్ప టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్‌లో యాంత్రికంగా పెద్ద మార్పులేవీ లేవు. 87.8 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఎకో థ్రస్ట్ ఇంజిన్‌,  4.8 బిహెచ్‌పి,  5.8 ఎన్ఎమ్ పీక్ టార్క్  కీలక ఫీచర్లుగా ఉన్నాయి. ఎగుడుదిగుడు రోడ్లపై కూడా సునాయాసంగా ప్రయాణించేందుకు  టెలిస్కోపిక్ సస్పెన్షన్‌తోపాటు వెనుక భాగంలో సింగిల్ షాక్‌తో వస్తుంది.  సీబీఎస్‌, డ్రమ్ బ్రేక్‌లను ఇరువైపులా అమర్చింది. 

టీవీఎస్ స్కూటీ పెప్  ప్లస్‌లో మొబైల్ ఛార్జర్ సాకెట్, సైడ్ స్టాండ్ అలారం, అండర్-సీట్ స్టోరేజ్ హుక్స్,  ఓపెన్ గ్లోవ్ బాక్స్‌, బ్రాండ్ పేటెంట్ పొందిన 'ఈజీ' స్టాండ్ టెక్నాలజీ లాంటి అధునాతన  ఫీచర్లు జోడించింది. అలాగే 30 శాతం  స్కూటీ బరువు కూడా తగ్గించింది.  కాగా  పాతికేళ్ల  క్రితం  మహిళా రైడర్ల కోసం టీవీఎస్ స్కూటీ ఎంట్రీ లెవల్ స్కూటర్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చి  ఒక ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. భారతదేశంలో ఎక్కువ జనాదరణ పొందిన స్కూటర్లలో ఒకటిగా  స్కూటీ పెప్‌  కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు