28% పెరిగిన పీసీ అమ్మకాలు

18 Aug, 2018 02:17 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ పర్సనల్‌ కంప్యూటర్‌ (పీసీ) అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ కాలంలో 28.1 శాతం వృద్ధి చెందినట్లు రీసెర్చ్‌ సంస్థ ఐడీసీ వెల్లడించింది. ఈకాలంలో 22.5 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు తెలిపింది. ఈ విభాగంలో హెచ్‌పీ 31.6% మార్కెట్‌ వాటాతో తన లీడర్‌ షిప్‌ను కొనసాగించగా.. ఆ తరువాత స్థానంలో ఉన్న డెల్‌ 23.7%, లెనొవో 18% మార్కెట్‌ వాటాను నిలబెట్టుకున్నట్లు వెల్లడించింది. ఇక ఏడాది ప్రాతిపదికన నోట్‌బుక్స్‌ అమ్మకాలు 45.2 శాతం వృద్ధి చెంది మొత్తం పీసీ అమ్మకాలలో 61 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు