-

ఆపిల్‌ ఫోన్లు లాంచింగ్‌ నేడే..

10 Sep, 2019 10:07 IST|Sakshi

సాక్షి, ముంబై:  అమెరికాకు చెందిన మొబైల్‌ దిగ్గజం ఆపిల్ త‌న నూత‌న ఐఫోన్లను  రోజు (సెప్టెంబరు 10, మంగళవారం)  విడుద‌ల చేయ‌నుంది. స్టాటస్ సింబల్ గా భావించే, అందులోనూ కేంద్ర ప్రభుత్వ కొత్త ఎఫ్‌డీఐ నిబంధనల నేపథ్యంలో అందుబాటు ధరలో లభించనున్న ఈ కొత్త ఐఫోన్ల కోసం ఐఫోన్ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఆ ఫోన్ల‌కు గాను ఆపిల్ ప్రీ ఆర్డ‌ర్ల‌ బుకింగ్ ప్రారంభం కానుంది.  ఈ సారి మూడు కొత్త ఐఫోన్ల‌ను ఆపిల్ విడుద‌ల చేస్తుంది. ఈ క్రమంలో లో ఎండ్ ఐ ఫోన్లు ముందుగా అందుబాటులోకి తీసుకురానుంది. తాజా సమాచారం ప్రకారం ఐఫోన్ 11, ఐఫోన్11 ప్రొ, ఐఫోన్ ప్రొ మ్యాక్స్ మోడళ్ళు రానున్నాయని తెలుస్తోంది. వీటితో పాటు  ఐఫోన్ 11, వాచ్లను విడుదల చేయనుంది. అంతేకాదు చౌకధరలో ఐఫోన్ ఎక్స్ ఎస్ మోడల్ కూడా ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. 

స్పెసిఫికేషన్లపై అంచనాలు ఇలా ఉన్నాయి

ఐఫోన్ 11 ఫీచర్లు
6.1 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 3డీ టచ్ ఫార్మాట్
ఏ13 ప్రాసెసర్
512జీబీ స్టోరేజ్
12+12 ఎంపీ రియర్ కెమెరా
12 ఎంపీ సెల్ఫీ కెమెరా
3110 ఎంఏహెచ్ బ్యాటరీ 
సుమారు ధర:  రూ. 53,700

ఐఫోన్ 11 ప్రో  ఫీచర్లు
5.8 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే
ఏ13 ప్రాసెసర్
512జీబీ స్టోరేజ్
12+12+12 ఎంపీ రియర్‌ కెమరా
12ఎంపీసెల్పీ కెమెరా
3190 ఎంఏహెచ్ బ్యాటరీ
సుమారు   సుమారు రూ.71,000

ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్  ఫీచర్లు
6.5 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే
ఏ13 ప్రాసెసర్
512జీబీ స్టోరేజ్
12+12+12 ఎంపీ రియర్‌ కెమెరా
12 ఎంపీ సెల్ఫీ కెమెరా
3500ఎంఏహెచ్ బ్యాటరీ
సుమారు ధర: రూ.78,800
 

మరిన్ని వార్తలు