ఎస్‌బీఐ, టెక్‌మహీంద్రా, జేకే సిమెంట్స్‌ షేర్లపై బుల్లిష్‌

22 Jun, 2020 14:35 IST|Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ, మోతీలాల్‌ ఓస్వాల్‌ బ్రోకరేజ్‌ల సిఫార్సులు

షేరు పేరు: ఎస్‌బీఐ
బ్రోకరేజ్‌ పేరు: హెచ్‌డీఎఫ్‌సీ బ్రోకరేజ్‌ 
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.218
కాల వ్యవధి: ఒక ఏడాది 
విశ్లేషణ: ప్రస్తుత సంక్షోభ పరిస్థితిల్లో లయబిలిటీ రిస్క్‌లను ఎదుర్కోనే శక్తి సామర్థా‍్యలు ఎస్‌బీఐకు పుష్కలంగా ఉన్నాయి. సంస్థలో ప్రభుత్వం మెజార్టీ వాటాను కలిగి ఉండటం, డిపాజిట్లు క్రమంగా పెరుగుదల ఇందుకు సహకరిస్తున్నాయి. లోక్‌బుక్‌ నాణ్యత కారణంగా అసెట్‌ క్వాలిటీ విషయంలో అనేక ఇతర పెద్ద బ్యాంకుల కంటే మెరుగైన స్థానంలో ఉంది. కాబట్టి షేరును ప్రస్తుత మార్కెట్‌ ధర(రూ.189.55) వద్ద కొనుగోలు చేయడం ఉత్తమం. అలాగే రూ.152-157 పరిధి వరకు పడిన ప్రతిసారి కొనుగోలు చేయవచ్చు. 

షేరు పేరు: టెక్‌ మహీంద్రా 
బ్రోకరేజ్‌ పేరు: హెచ్‌డీఎఫ్‌సీ బ్రోకరేజ్‌ 
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌: రూ.601
కాల వ్యవధి: ఒక ఏడాది 
విశ్లేషణ: కోవిడ్‌-19 ప్రేరేపిత లాక్‌డౌన్లు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పరిస్థితులు ఐటీ రంగాన్ని పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. దీంతో ప్రముఖ గ్లోబల్ కమ్యూనికేషన్ కంపెనీలు నెట్‌వర్క్ వ్యవస్థపై ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు. కనెక్టివిటీకి డిమాండ్‌ పెరగడం కూడా ఈ షేరుకు కలిసొచ్చే అంశంగా ఉంది. కమ్యూనికేషన్‌ వర్టికల్‌లో అగ్రస్థానానికి చేరుకునేందుకు టెక్‌ మహీంద్రాకు పుష్కలంగా అవకాశాలున్నాయి. కాబట్టి ఈ షేరును రూ.500-508 ‍శ్రేణిలో కొనుగోలు చేయడం ఉత్తమం. అలాగే రూ.455-460 శ్రేణి వరకు పతనమైన ప్రతిసారి కొనుగోలు చేయవచ్చు.

షేరు పేరు: జేకే సిమెంట్స్‌ 
బ్రోకరేజ్‌ పేరు: మోతీలాల్‌ ఓస్వాల్‌  
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌: రూ.1450.00
కాల వ్యవధి: ఒక ఏడాది
విశ్లేషణ: వ్యాపార విస్తరణతో ద్వారా అమ్మకాలు, ఆదాయ వృద్ధి జరగుతుందని అంచనా. ఉత్తర, మధ్య భారత్‌లో అమ్మకాలు పెరుగుతాయని అంచనా. కొత్తగా కంపెనీ పెట్టే వ్యయంతో ఉత్పాదక సామర్థ్యం పెరగుతుంది. తద్వారా కంపెనీ వార్షిక సగటు ఖర్చు తగ్గుతుంది. కాబట్టి రూ.1450.00 టార్గెట్‌ ధరతో ప్రస్తుత మార్కెట్‌ ధర(రూ.1419.95) వద్ద కొనుగోలు చేయడం ఉత్తమం. 

>
మరిన్ని వార్తలు