వచ్చే ఏడేళ్లలో.. 3 ట్రిలియన్ డాలర్లకు మొబైల్ పేమెంట్స్

15 Sep, 2015 00:03 IST|Sakshi
వచ్చే ఏడేళ్లలో.. 3 ట్రిలియన్ డాలర్లకు మొబైల్ పేమెంట్స్

- బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అంచనా
న్యూఢిల్లీ:
దేశంలో మొబైళ్ల ద్వారా జరిగే చెల్లింపులు (మొబైల్ పేమెంట్స్) వచ్చే ఏడేళ్లలో 200 రెట్ల వృద్ధితో 3 ట్రిలియన్ డాలర్లకు చేరతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అభిప్రాయపడింది. ప్రస్తుతం మొబైల్ బ్యాంకింగ్ విలువ 16 బిలియన్ డాలర్లుగా ఉందని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో జరిగిన మొత్తం చెల్లింపులలో 0.1 శాతంగా ఉన్న మొబైల్ పేమెంట్స్ వాటా కూడా 10 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

>
మరిన్ని వార్తలు