వెలుగులోకి రూ. 400 కోట్ల జీఎస్‌టీ స్కామ్‌

25 Sep, 2019 07:56 IST|Sakshi

అహ్మదాబాద్‌: జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ విభాగం రూ.400 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించింది. దేశ రాజధాని ప్రాంతానికి  చెందిన ఎగుమతిదారులు గుజరాత్‌లోని కాండ్లా ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్‌)లోని యూనిట్ల సాయంతో రూ.400 కోట్ల వరకు జీఎస్‌టీ రిఫండ్‌ను పొందినట్టు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారులు గుర్తించారు. తక్కువ నాణ్యతతో కూడిన పొగాకు ఉత్పత్తులు సెంటెడ్‌ జర్దా, ఫిల్టర్‌ ఖైనీ కేంద్రంగా ఈ స్కామ్‌ జరిగినట్టు డీజీజీఐ తెలిపింది. వీటిని కిలో రూ.50–350కు కొనుగోలు చేసి, కాంట్లా ఎస్‌ఈజెడ్‌ యూనిట్లకు కిలో రూ.5,000–9,000కు ఎగుమతి చేసినట్టుగా చూపించారని పేర్కొంది. మార్కెట్‌ విలువ కంటే 3,000 శాతం అధికంగా చూపించడం ద్వారా అక్రమంగా రూ.400 కోట్లను ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ కింద పొందారని తెలిపింది.

మరిన్ని వార్తలు