రోజుకు ఐదు సిగరెట్ల ఖర్చు కోటి రూపాయలు..

31 May, 2017 15:42 IST|Sakshi
రోజుకు ఐదు సిగరెట్ల ఖర్చు కోటి రూపాయలు..
న్యూఢిల్లీ : పొగతాగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో ప్రతిఒక్కరికీ తెలుసు. స్మోకర్లకూ ఈ విషయంపై ఇంకా బాగా అవగాహన ఉంటుంది. అయినా కూడా పొగరాయుళ్లు మాత్రం సిగరెట్ ను వదిలిపెట్టరు. గుప్పుగుప్పుమని పొగవదులుతూనే ఉంటారు. కానీ మీకు తెలియని మరో విషయమేమిటంటే.. స్మోకింగ్ మీరు ఊహించదానికంటే ఎక్కువగా మిమ్మల్ని ఆర్థికంగా కుంగదీస్తుంది. వరల్డ్ నో-టుబాకో డేగా సందర్భంగా ఎకనామిక్ టైమ్స్ ఆరోగ్యానికి స్మోకింగ్ కలుగజేసే ముప్పుతో పాటు ఆర్థికంగా ఏమేర దెబ్బతీస్తుందో గణాంకాలతో సహా వివరించింది. ఒకవేళ మీకు 30 ఏళ్ల వయసు ఉండి రోజుకు ఐదు సిగరెట్లు కాల్చకుండా ఉండలేకపోతున్నారనుకుంటే... రిటైర్మెంట్ వయసు 60ఏళ్లకు వచ్చేసరికి మీరు కోటికి పైగా రూపాయలకు పైగా కోల్పోవాల్సి వస్తుందని తెలిపింది. ఆ కోటి రూపాయలతో పాటు, పరోక్షంగా మరింత మొత్తాన్ని కోల్పోతారని ఎకనామిక్ టైమ్స్ అంచనావేసింది.  
 
సిగరెట్లపై చేసే వ్యయం...
సిగరెట్లపై చేసే పొగరాయుళ్లు చేసే వ్యయం  ఆర్థికంగా భారీగా దెబ్బకొడుతోంది. ఒక్కో సిగరెట్ ధర రూ.10-15 మధ్యలో ఉంటే, రోజుకు ఐదు సిగరెట్లను కాల్చితే వాటితో 60రూపాయల మేర ఖర్చవుతుంది. అంటే నెలకు 1800 రూపాయల పైననే సిగరెట్ల కోసం వెచ్చిస్తారు.  
నెలకు ఖర్చు      ఏడాదికి వీటిపై పెంపు     30 ఏళ్లలో సిగరెట్లపై చేసే వ్యయం
రూ.1800            8 శాతం                      రూ.24.47 లక్షలు
ఒకవేళ ఆ మొత్తాన్ని సిగరెట్లపై కాకుండా.. పెట్టుబడులుగా పెట్టి ఉంటే, 9 శాతం వడ్డీతో రూ.69.23 లక్షలు పొదుపు చేస్తారు. 
 
ఇవి కేవలం అంచనాలు మాత్రమే. పొగాకు ఉత్పత్తులపై పన్నులు విపరీతంగా పెరుగుతుంటాయి. దీంతో సిగరెట్ ధరలు ప్రతేడాది గణనీయంగా పైకి ఎగుస్తూ ఉంటాయి. గత నాలుగేళ్లలో ప్రతేడాది సగటున 20 శాతం మేర సిగరెట్ ధరలు పెరిగాయి.  గత నాలుగేళ్లలో సిగరెట్ ధరలు రెండింతలు కంటే ఎక్కువగా పైకి ఎగిశాయి.
 
గోల్డ్ ఫ్లేక్ కింగ్స్ ప్యాకెట్ ధరలు
 
సిగరెట్ తాగడం వల్ల అయ్యే వైద్య ఖర్చులు...
నెలకు అయ్యే ఖర్చు        వార్షిక పెంపు          30 ఏళ్లలో ఖర్చు
400 రూపాయలు              12 శాతం              రూ.11.59 లక్షలు
ఒకవేళ  ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే 9 శాతం వడ్డీతో రూ.26.7 లక్షలవుతాయి.
 
అయితే వినియోగదారుల ద్రవ్యోల్బణంతో పోలిస్తే వైద్య ద్రవ్యోల్బణం చాలా అధికంగా ఉంటుంది. డ్రగ్స్ ధరలు, డాక్టర్ల కన్సల్టేషన్ ఛార్జీలు, డయాగ్నోస్టిక్ ఛార్జీలు సగటున 15 శాతం మేర పెరిగాయి. ఏడాదికి 12 శాతం పెంపుతోనే వీటిని గణించింది ఎకనామిక్ టైమ్స్.
 
ఇన్సూరెన్స్ వ్యయాలు...
లైఫ్ ఇన్సూరర్స్ స్మోకర్ల నుంచి ఎక్కువ ప్రీమియంలు వసూలు చేస్తాయి. కోటి రూపాయల బీమా కవర్ చేయాలంటే 30ఏళ్ల వ్యక్తి ప్రతినెలా రూ.460 ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన...
నెలవారీ ఖర్చు         వార్షిక పెంపు           30ఏళ్లలో ఖర్చు
రూ.460                    నిల్                   రూ.1.65 లక్షలు
ఈ మొత్తాన్ని కూడా 9శాతంతో ఇన్వెస్ట్ చేస్తే అది రూ.7.52 లక్షలవుతుంది. 
 
సిగరెట్ల ఖర్చు             మెడికల్ వ్యయాలు            ఇన్సూరెన్స్ ఖర్చు 
రూ.69.23 లక్షలు  +      రూ.26.70 లక్షలు  +      రూ.7.52 లక్షలు
ఈ మొత్తం కలిపితే రూ.1.03 కోట్లవుతుంది.  
మరిన్ని వార్తలు