సంక్షోభ సమయంలో పాంచ్‌ పటాకా సిఫార్సులు!

20 May, 2020 12:32 IST|Sakshi

కరోనా సంక్షోభానికి ఒక పరిష్కారం దొరికేవరకు మార్కెట్లు స్వల్ప రేంజ్‌లోనే ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటప్పుడు నిఫ్టీలో టాప్‌టెన్‌ స్థానాల్లో స్థిరంగా నిలుస్తూవస్తున్న కంపెనీలను ఎంచుకొని పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. వీటిలో టాప్‌ 5 షేర్లను రికమండ్‌ చేస్తున్నారు. రిలయన్స్‌, టీసీఎస్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐబ్యాంక్‌ షేర్లపై పెట్టుబడులు బెటరని సూచిస్తున్నారు. 2005 నుంచి ఇప్పటివరకు టీసీఎస్‌ 1260 శాతం, ఆర్‌ఐఎల్‌ 1250 శాతం, ఇన్ఫీ 420 శాతం, ఐటీసీ 400 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 320 శాతం మేర ర్యాలీ జరిపాయి. మార్కెట్‌ క్లిష్టపరిస్థితుల్లో ఉన్న వేళ వీటిని నమ్మడం మంచిదని సేజ్‌వన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ ప్రతినిధి సమిత్‌ వర్తక్‌ చెప్పారు. 

  • ఇటీవల కాలంలో వరుస ఫండ్‌రైజింగ్‌లతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా రైట్స్‌ ఇష్యూకు వచ్చింది. ఈనేపథ్యంలో షేరుపై పలు బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా మారాయి. 
  • టీసీఎస్‌ తాజా త్రైమాసికంలో ఆశించిన ఫలితాలు చూపలేదు.  ఇన్ఫోసిస్‌ సైతం ఇదే తరహాలో ఫలితాలు ప్రకటించింది. కానీ తాజా రూపీ పతనం ఈ షేర్లకు చాలా మేలు చేస్తుందని బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. ఇవి నాణ్యమైన డిఫెన్సివ్‌ బెట్సని రెలిగేర్‌బ్రోకింగ్‌ అభిప్రాయపడింది. 
  • ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఇటీవల కాలంలో భారీ పతనం చూసింది. దీంతో షేరు వాల్యూషన్లు బాగా దిగివచ్చాయి. కంపెనీ రాబోయే రోజుల్లో మంచి వృద్ధి నమోదు చేస్తుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది.
  • ఇటీవలి పతనంలో ఐసీఐసీఐ బ్యాంకు షేరు బాగా క్షీణించింది. ఇది ఈ షేరులో దీర్ఘకాలిక పెట్టుబడులకు చాలా మంచి అవకాశం కల్పిస్తోందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. 
మరిన్ని వార్తలు