నో 52 వీక్‌ లోస్‌..ఓన్లీ గెయిన్స్‌

4 Jun, 2020 12:31 IST|Sakshi

గురువారం ఎన్‌ఎస్‌ఈలో 20 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరాయి. వీటిలో ఆర్తి డ్రగ్స్‌, ఆల్‌కెమిస్ట్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అరబిందో ఫార్మా, బ్రైట్‌కామ్‌ గ్రూప్‌, బిర్లా టైర్స్‌, సిప్లా, డిజి స్పైస్‌ టెక్నాలజీస్‌, ఎడ్యూకాంప్‌ సొల్యూషన్స్‌, జీఎంఎం ఫాడ్లర్‌, గొయంక డైమండ్‌ అండ్‌ జువెల్స్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా, లాయిడ్స్‌ స్టీల్స్‌ ఇండస్ట్రీస్‌, మార్క్‌సన్స్‌ ఫార్మా, మిట్టల్‌ లైప్‌ స్టైల్‌, ఆఫ్టో సర్య్కూట్స్‌(ఇండియా), ప్రకాశ్‌ స్టీలేజ్‌, రుచీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సుబెక్స్‌లు ఉన్నాయి. నేడు ఏ ఒక్క షేరు కూడా ఏడాది కనిష్టాన్ని తాకలేదు. నిఫ్టీ50 ఇండెక్స్‌లో 25 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా మరో 25 షేర్లు నష్టాలో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక ఈ ఇండెక్స్‌లో భాగమైన వేదాంత, టెక్‌ మహీంద్రా, సన్‌ ఫార్మా, సిప్లా, బీపీసీఎల్‌లు టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. టైటాన్‌ కంపెనీ, ఏసియన్‌ పెయింట్స్‌, కొటక్‌ బ్యాంక్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌,హెచ్‌డీఎఫ్‌సీలు టాప్‌ లూసర్స్‌గా ఉన్నాయి. కాగా మధ్యహ్నాం 12:15 గంటల ప్రాంతంలో బీఎస్‌ఈలో సెన్సెక్స్‌ 265.08 పాయింట్లు నష్టపోయి 33,844.46 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 75.60 పాయింట్ల నష్టపోయి 9,985.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు