బ్రైట్‌కామ్‌, బయోకాన్‌, సిప్లా.. అప్‌

5 Jun, 2020 12:29 IST|Sakshi

గత ఆరు రోజులుగా దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతూ, గురువారం కొంతమేర నష్టపోయినప్పటికీ  శుక్రవారం తిరిగి పుంజకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో నేడు 29 షేర్లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి. వీటిలో ఆల్‌కెమిస్ట్‌, అల్కైల్‌ ఎమైన్స్‌ కెమికల్స్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, ఆంధ్రా సిమెంట్స్‌, బ్రైట్‌కామ్‌ గ్రూప్‌, బయోకాన్‌, బిర్లా టైర్స్‌, సిప్లా, కంప్యూకామ్‌ సాఫ్ట్‌వేర్‌, డిజీస్పైస్‌ టెక్నాలజీస్‌, ఎడ్యూకామ్‌‌ సొల్యూషన్స్‌, జీఎంఎం ఫాడ్లర్‌, గొయంక డైమండ్‌ అండ్‌ జువెల్స్‌, హిందుస్థాన్‌ మోటార్స్‌, జేఎంటీ ఆటో, లుపిన్‌, మార్క్‌సన్స్‌ ఫార్మా, మెకనెల్లీ భారత్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ, మిట్టల్‌ లైఫ్‌స్టైల్‌లు ఉన్నాయి. నేడు రెండు షేర్లు మాత్రమే ఏడాది కనిష్టాన్ని తాకాయి. వీటిలో హోటల్‌ రగ్బీ, సుప్రీం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండియాలు ఉన్నాయి. కాగా మధ్యహ్నాం 12:20 గంటల ప్రాంతంలో బీఎస్‌ఈలో సెన్సెక్స్‌ 202 పాయింట్లు లాభపడి 34,182 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 85 పాయింట్ల లాభంతో 10,114 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ50 ఇండెక్స్‌లో టాటా మోటార్స్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, టాటా స్టీల్‌, యూపీఎల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌ టాప్‌ గెయినర్‌లుగా ఉండగా.. టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఆటో, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, వేదాంతాలు టాప్‌ లూసర్స్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి.

Related Tweets
మరిన్ని వార్తలు