లాక్‌డౌన్‌తో ఉద్యోగాలకు ముప్పు

6 Apr, 2020 06:13 IST|Sakshi

సీఐఐ సీఈవోల సర్వేలో వెల్లడి  

న్యూఢిల్లీ: కరోనావైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌తో దేశ ఎకానమీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. వీటితో భారీగా ఆదాయాలు, డిమాండ్‌ పడిపోవడంతో పాటు గణనీయంగా ఉద్యోగాల కోతలు కూడా ఉంటాయని కార్పొరేట్లు భావిస్తున్నారు. కంపెనీల సీఈవోలతో పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివిధ రంగాల సంస్థలకు చెందిన సుమారు 200 మంది సీఈవోలు ఇందులో పాల్గొన్నారు. ‘గత త్రైమాసికంతో (జనవరి–మార్చి) పోలిస్తే ప్రస్తుత క్వార్టర్‌లో (ఏప్రిల్‌–జూన్‌) ఆదాయాలు 10 శాతం, లాభాలు 5 శాతం పైగా తగ్గిపోతాయని మెజారిటీ సంస్థలు భావిస్తున్నాయి. జీడీపీ వృద్ధిపై కరోనా ఏ మేరకు ప్రభావం చూపబోతోందన్నది ఇది తెలియజేస్తోంది. సర్వేలో పాల్గొన్న 52 శాతం సంస్థలు.. తమ తమ రంగాల్లో గణనీయంగా ఉద్యోగాల్లో కోతలు ఉంటాయని అంచనా వేస్తున్నాయి’ అని సీఐఐ వెల్లడించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు