నష్టాల మార్కెట్లోనూ ఏడాది గరిష్టానికి 60 షేర్లు

29 Jun, 2020 14:16 IST|Sakshi

4షేర్లే ఏడాది కనిష్టానికి

స్టాక్‌ మార్కెట్‌ సోమవారం మిడ్‌ సెషన్‌ సమయానికి నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. దేశీయంగానూ, అటు అంతర్జాతీయంగా కోవిడ్‌-19 కేసులు పెరుగుదల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆందోళనలు మార్కెట్‌లో అమ్మకాలకు కారణమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 

మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్న ఈ తరుణంలో ఎన్‌ఎస్‌ఈలో 60 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిని అందుకున్నాయి. ఆస్ట్రాజెనికా ఫార్మా, అలోక్‌ ఇండస్ట్రీస్‌, ఆంధ్రా సిమెంట్స్‌, జీటీఎన్‌ ఇండస్ట్రీస్‌, బఫ్నా ఫార్మా, బిర్లా టైర్స్‌, ఐడీబీఐ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీ్‌స్‌ బ్యాంక్‌, కర్డా కన్‌స్ట్రక్చన్స్‌, ఓమాక్స్‌, శ్రీ దిగ్విజయ్‌ సిమెంట్‌, రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ అందులో ఉన్నాయి. 

4 షేర్లే ఏడాది కనిష్టానికి 
మార్కెట్‌ భారీ నష్టాన్ని చవిచూసినప్పటికీ.., కేవలం 4 షేర్లు మాత్రమే ఏడాది కనిష్టస్థాయిని తాకడం విశేషం. బీ.సీ. పవర్‌ కంట్రోల్స్‌, టచ్‌వుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, యూనివస్తు ఇండియా షేర్లు వాటిలో ఉన్నాయి.


మధ్యాహ్నం 2గంటల సమయానికి సెన్సెక్స్‌ 318పాయింట్ల నష్టంతో 34,852 వద్ద, నిఫ్టీ 102 పాయింట్లు పెరిగి 10,280 వద్ద ‍ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి నిఫ్టీ-50 సూచీలో జీలిమిటెడ్‌, బీపీసీఎల్‌, హిందాల్కో, యాక్సిస్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా షేర్లు 3.50శాతం నుంచి 5శాతం నష్టపోయాయి. ఎంఅండ్‌ఎం, హిందూస్థాన్‌ యూనిలివర్‌, సిప్లా, బ్రిటానియా, ఐటీసీ షేర్లు 1శాతం నుంచి 2శాతం లాభడ్డాయి. 

మరిన్ని వార్తలు