రియల్టీలో64/100 మార్కులు

14 Jan, 2017 01:27 IST|Sakshi
రియల్టీలో64/100 మార్కులు

రెండున్నర ఏళ్ల పాలనపై జేఎల్‌ఎల్‌ రిపోర్ట్‌

సాక్షి, హైదరాబాద్‌
భారత ప్రధాని నరేంద్ర మోదీకి 64/100 మార్కులొచ్చాయి. ప్రభుత్వ రెండున్నర ఏళ్ల పాలనలో దేశీయ స్థిరాస్తి రంగం పనితీరును విశ్లేషిస్తూ జోన్స్‌ లాంగ్‌ లాసెల్లె (జేఎల్‌ఎల్‌) ప్రోగ్రెస్‌ కార్డును విడుదల చేసింది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను ఆధారంగా చేసుకొని ఈ రిపోర్ట్‌ కార్డును రూపొందించారు. స్మార్ట్‌సిటీ, మౌలిక వసతులు, పెట్టుబడులు, పర్యాటకం/ఆతిథ్యం, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), మేకిన్‌ ఇండియా, నిబంధనలు, పారదర్శకత వీటిల్లో మాత్రం మోదీ ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉందని.. అందుబాటు గృహాలు (అఫడబుల్‌ హౌసింగ్‌), భూసేకరణ, పునరావాస మరియు పునరుద్ధరణ బిల్లు అమలులో మాత్రం ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చలేదని పేర్కొంది. మొత్తం మీద మోదీ ప్రభుత్వం దేశీయ రియల్టీ రంగంలో మోస్తరుగా విజయవంతమైందని రిపోర్ట్‌ సారాంశం.
స్థిరాస్తి రంగం పనితీరు ఎలా ఉందంటే..

గతంతో పోల్చుకుంటే మోదీ రెండున్నర ఏళ్ల పాలనలో దేశంలోని కార్యాలయ, రిటైల్, ఆతిథ్య విభాగాలు మాత్రం రికవరీ అయ్యాయి. నివాస సముదాయ విభాగం మాత్రం నేటికీ నత్తనడకన సాగుతోంది.
దేశంలో నికరంగా గ్రహించిన ఆఫీస్‌ మార్కెట్‌: 28 శాతం
బీపీఎస్‌ 270 పాయింట్లు తగ్గింది.
గతంలో ఆతిథ్య రంగం 58.4 శాతం గది ఆక్యుపెన్సీ ఉండగా.. ప్రస్తుతమిది 63.4 శాతానికి పెరిగింది.
రిటైల్‌ మార్కెట్‌ 250 పాయింట్లకు బీపీఎస్‌ వేకెన్సీకి పడిపోయింది.
దేశంలో నేటికీ అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు 40 శాతానికి పెరిగాయి.
24 శాతం అమ్మకాలు పడిపోయాయి. ఉద్యోగ విపణిలో పాక్షిక వృద్ధి కనిపించినా..
వేతనాల వృద్ధి మాత్రం మందగించింది.

మెరుగైన పనితీరు
ధరల స్థిరీకరణ, మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వ్యవస్థాగత, విధాన ప్రకటనలు, మెరుగైన కమ్యూనికేషన్‌.
మోస్తరు పనితీరు
అవినీతి, నల్లధనం, న్యాయ వాదనలు, ఈ–గవర్నెన్స్, డిజిటల్‌ ఇండియా
పేలవమైన పనితీరు
మెరుగైన జీవన శైలి, పేదరిక నిర్మూలన

మరిన్ని వార్తలు