మూడేళ్ల దాకా స్టార్టప్స్ జోలికెళ్లొద్దు

26 Jan, 2016 02:08 IST|Sakshi
మూడేళ్ల దాకా స్టార్టప్స్ జోలికెళ్లొద్దు

ఈపీఎఫ్‌వో, ఈఎస్‌ఐసీకి కార్మిక శాఖ ఆదేశం
 న్యూఢిల్లీ: స్టార్టప్ సంస్థలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించింది. ప్రారంభమైన మూడేళ్ల దాకా రిటర్నుల దాఖలు నుంచి, తనిఖీల నుంచి వాటికి మినహాయింపులిచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో, కార్మిక రాజ్య బీమా సంస్థ ఈఎస్‌ఐసీకి కే ంద్ర కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

నిర్దేశిత 9 కార్మిక చట్టాలను సక్రమంగా పాటిస్తున్నట్లు స్వయం ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది. తొలి ఏడాది ఇందుకు సం బంధించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్-డిక్లరేషన్ ఫారం సమర్పిం చాల్సి ఉం టుంది. తదుపరి రెండేళ్లు కూడా తనిఖీలు, రిటర్నుల దాఖలు నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు విశ్వసనీయమైన ఫిర్యాదు రాతపూర్వకంగా వచ్చిన పక్షంలో ఆయా విభాగాలు తనిఖీలు చేయొచ్చు.
 

మరిన్ని వార్తలు