ఆ సత్తా మన కంపెనీలకు లేదు

15 Dec, 2016 00:40 IST|Sakshi
ఆ సత్తా మన కంపెనీలకు లేదు

ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడటంలో తీసికట్టే
రియల్టీ సంస్థ సీబీఆర్‌ఈ నివేదికలో వెల్లడి   


ముంబై: భారత కంపెనీల్లో 75 శాతానికి పైగా ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునేందుకు సిద్ధంగా లేవని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సీబీఆర్‌ఈ తన నివేదికలో పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాల రిస్క్‌ను తగ్గించడానికి ప్రభుత్వ సంస్థలతో కలసి పనిచేసే ప్రైవేట్‌ సంస్థల సంఖ్య మరింతగా పెరగాల్సి ఉందంటున్న ఈ నివేదికలోని ముఖ్యాంశాలివీ...

ముందు చూపు, తగిన ప్రణాళిక లేనందునే భూకంపాలు, తుఫాన్‌ల వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల భారీ స్థాయిలో నష్టాలు వస్తున్నాయని 96% కంపెనీలు అంగీకరించాయి.
తమ ప్రాజెక్టుల్లో ఆపదలను తగ్గించే చర్యలు తీసుకున్నామని చెప్పిన కంపెనీల సంఖ్య 21 శాతంగానే ఉంది. అన్ని భవనాలను వివిధ కాలవ్యవధుల్లో తనిఖీ చేయడం తప్పనిసరని 97 శాతం కంపెనీలు అంగీకరించాయి.

మరిన్ని వార్తలు