80 శాతం ఉద్యోగాలు అవుట్‌సోర్స్‌కు అర్హమైనవే

28 Dec, 2017 00:11 IST|Sakshi

అయినా కంపెనీల వెనుకంజ

ఐసీఆర్‌ఐఈఆర్‌ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో 70–80 శాతం ఉద్యోగాలు పొరుగు సేవలకు మళ్లించేందుకు అవకాశమున్నవేనని, అయినా ఫ్రీలాన్సర్లను నియమించుకునే విషయంలో కంపెనీలు పునరాలోచనలో ఉన్నాయని ఐసీఆర్‌ఐఈఆర్, లిర్నేషియా సంయుక్త అధ్యయనం పేర్కొంది. ‘‘భారత కంపెనీలు ఇప్పటికీ ఫ్రీలాన్సర్లను (స్వతంత్రంగా పనిచేసేవారు) అవుట్‌సోర్స్‌ చేసుకోవడం వల్ల కలిగే లాభాలను పట్టించుకోవడం లేదు.

70–80 శాతం ఉద్యోగాలు సరైన వసతులుంటే ఔట్‌సోర్స్‌కు మళ్లించతగినవే’’ అని ఈ అధ్యయన నివేదిక తెలిపింది. ఆన్‌లైన్‌ ఫ్రీలాన్సింగ్, సూక్ష్మ పనులకు సంబంధించి దేశంలో ఉన్న సవాళ్లపై ఈ సంస్థలు అధ్యయనం నిర్వహించాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 1976 మంది విద్యార్థులు, ఫ్రీలాన్సర్ల నుంచి అభిప్రాయాలను సమీకరించి నివేదిక రూపంలో విడుదల చేశాయి.  

మరిన్ని వార్తలు