ఈపీఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ రేటు 

27 Apr, 2019 00:28 IST|Sakshi

బోర్డు ప్రతిపాదనకు ఆర్థిక శాఖ ఆమోదం

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌)పై 2018–19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటు అమలు కానుంది. కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ అధ్యక్షతన ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ వడ్డీ రేటు పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకోగా, దీనికి కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. ఈపీఎఫ్‌వో వడ్డీ రేటు ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం అమోదం తెలిపినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 2017–18లో ఈపీఎఫ్‌ నిధులపై 8.55 శాతం వడ్డీ రేటు అమలు కాగా, దీన్ని స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.  

2015–16 ఆర్థిక సంవత్సరానికి 8.8 శాతం వడ్డీ రేటు ఉండగా, ఆ తర్వాత రెండు సంవత్సరాల్లో స్వల్పంగా తగ్గించారు. ఆదాయపన్ను శాఖ, కార్మికశాఖ వడ్డీ రేటును నోటిఫై చేసిన తర్వాత చందాదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేయాలంటూ దేశవ్యాప్తంగా ఉన్న 120 క్షేత్రస్థాయి అధికారులకు ఈపీఎఫ్‌వో ఆదేశాలు జారీ చేస్తుంది. సభ్యుల భవిష్యనిధిపై 8.65 శాతం వడ్డీ చెల్లించిన అనంతరం కూడా సంస్థ వద్ద రూ.151.67 కోట్ల మిగులు నిల్వలు ఉంటాయని అంచనా.    

మరిన్ని వార్తలు