ఇండిగో నష్టం రూ. 871 కోట్లు

3 Jun, 2020 12:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌(ఇండిగో) కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ. 871 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. కరోనా వైరస్‌ కల్లోలం నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దవడంతో వ్యయాలు భారీగా పెరిగిన కారణంగా ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయని ఇండిగో తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) ఇదే క్వార్టర్‌లో రూ.596 కోట్ల నికర లాభం ఆర్జించామని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.8,260 కోట్ల నుంచి రూ.8,635 కోట్లకు పెరిగింది.  ఇంధన వ్యయాలు 3%, ఇతర వ్యయాలు 46% చొప్పున పెరిగాయి.  మొత్తం మీద వ్యయాలు 30 శాతం పెరిగి రూ.9,924 కోట్లకు చేరాయి.  లోడ్‌ ఫ్యాక్టర్‌(సీట్‌ ఆక్యుపెన్సీ)86 శాతం నుంచి 83 శాతానికి తగ్గింది. పూర్తి ఏడాదిపరంగా చూస్తే, 2018–19లో రూ.157 కోట్ల నికర లాభం రాగా, 201920 లో రూ.234 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. 

ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇండిగో షేర్‌ 1% నష్టంతో రూ.946 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు