'టాప్' లేపిన గూగుల్!

26 Sep, 2017 09:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రొఫెషనల్ డిగ్రీలు, పీజీలు పూర్తిచేసుకున్న విద్యార్థులు తమకు పలానా కంపెనీలో జాబ్ వస్తే ఒక తమకు తిరుగులేదని భావిస్తుంటారు. తాజాగా ఓ బ్రాండింగ్ ఏజెన్సీ సర్వే చేయగా రెండు విభాగాల విద్యార్థులు ఆసక్తి చూపించడంతో గూగుల్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులపై సర్వే చేసి మోస్ట్ అట్రాక్టివ్ ఎంప్లాయిస్ ఫర్ స్టూడెంట్స్ 2017 పేరిట కొన్ని కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఇంజినీరింగ్, ఇతర సాఫ్ట్‌ఫేర్ విద్యార్థులతో పాటు బిజినెస్ స్టూడెంట్స్ (ఎంబీఏ, ఎంకామ్, బీబీఏ గ్రాడ్యుయేట్లు) గూగుల్‌నే తమ ఫెవరెట్ కంపెనీగా భావిస్తున్నారు.

భారత్, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యా, దక్షిణకొరియా, యూకే, అమెరికా దేశాల్లో యూనివర్సమ్ ఈ సర్వే చేసింది. ఇంజినీరింగ్ నిరుద్యోగులు జాబ్ కోరుకున్న కంపెనీల్లో గూగుల్ తర్వాత మైక్రోసాఫ్ట్, యాపిల్, జనరల్ ఎలక్ట్రిక్, బీఎండబ్ల్యూ గ్రూపు, ఐబీఎం, ఇంటెల్, సీమెన్స్, సోని, శాంసంగ్ కంపెనీలు నిలిచాయి.

బిజినెస్ విభాగం విషయానికొస్తే.. గూగుల్ తర్వాత గోల్డ్‌మ్యాన్ సాచ్స్, యాపిల్, ఈవై, పీడబ్ల్యూసీ, డెలాయిట్, మైక్రోసాఫ్ట్, లోరియల్ గ్రూపు, కేపీఎంజీ, జేపీ మోర్గాన్ సంస్థల్లో పనిచేసేందుకు ఈ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇంజినీరింగ్/ ఐటీ సెక్టార్ వారు పనిచేయాలనుకుంటున్న విభాగాలివే:

  • సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ సర్వీసెస్, మల్టీ మీడియా డెవలప్‌మెంట్, డిజిటల్ ఎంటైర్‌టైన్మెంట్ - 23శాతం
  • ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ మ్యానుఫక్చరింగ్ - 21శాతం
  • ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ - 20శాతం
  • ఆటోమోటివ్ - 17శాతం
  • ఎనర్జీ - 16శాతం

బిజినెస్ స్టూడెంట్స్ ఆసక్తి చూపిస్తున్న విభాగాలివే:

  • మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజీ కన్సల్టెన్సీస్ - 28శాతం
  • బ్యాంకింగ్ - 25శాతం
  • ఫైనాన్షియల్ సర్వీసెస్ - 23శాతం
  • ఆడిటింగ్ అండ్ అకౌంటింగ్ -  19శాతం
  • మీడియా అండ్ అడ్వర్‌టైజింగ్ - 17శాతం
మరిన్ని వార్తలు