6 నెలల కనిష్ఠానికి రూపాయి

26 Sep, 2017 11:42 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ కరెన్సీ​  రూపాయిని నార్త్‌ కొరియా ఆందోళన పట్టి పీడిస్తోంది.  మంగళవారం డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ మరింత పతనమై 6 నెలల కనిష్ఠానికి  పడిపోయింది.  ఆరంభంలోనే 18 పైసలు క్షీణించి 65.28 వద్ద కనిష్ఠస్థాయిని నమోదు చేసింది.  డాలర్‌కు  డిమాండ్‌ బాగా పుంజుకోవడంతో  21 పైసలు నష్టపోయిన దేశీయ కరెన్సీ 65.33 వద్ద కొనసాగుతోంది.  దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి అమెరికన్ కరెన్సీకి డిమాండ్ పెరిగిందని నిపుణులు  విశ్లేషిస్తున్నారు.

దేశీయ ఈక్విటీ మార్కెట్లుకూడా  బలహీనంగా ట్రేడ్‌ అవుతున్నాయి.  సెన్సెక్స్‌ 140పాయింట్లకుపై గా క్షీణించగా, నిఫ్టీ సైతం 50 పాయింట్లు కోల్పోయి కీలక మద‍్దతు స్థాయి 9850కి దిగువకు చేరింది.

అటు బంగారం ధర మాత్రం మరింత పుంజుకుంది. ఎంసీఎక్స్‌మార్కెట్లో పది  గ్రా. పుత్తడి  రూ.104 ఎగిసి 30, 143 వద్ద స్థిరంగా ఉంది.

మరిన్ని వార్తలు