15 రోజుల్లో రూ.950 కోట్ల ఈపీఎఫ్‌ విత్‌డ్రాయెల్స్‌!

17 Apr, 2020 07:25 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్త లౌక్‌డౌన్‌ పరిస్థితులతో ఎన్నో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. దీంతో ఉద్యోగుల భవిష్యనిధి– ఈపీఎఫ్‌ఓ నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతించడంతో.. స్పందన అధికంగానే వస్తోంది. గడచిన 15 రోజుల్లో దాదాపు రూ.950 కోట్ల విలువకు సంబంధించి 3.31 లక్షల క్లెయిమ్‌లను ఈపీఎఫ్‌వో పరిష్కరించినట్టు గురువారం కార్మిక మంత్రిత్వశాఖ తెలిపింది.  ఈపీఎఫ్‌ నిధిలో చందాదారుని వాటా మొత్తం నుంచి 75 శాతం లేదా మూడు నెలల మూలవేతనం, కరువు భత్యం ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంది. ఇందుకు సంబంధించి ఈపీఎఫ్‌ఓ స్కీమ్‌ నోటిఫికేషన్‌ మార్చి 28న  వెలువడింది.

మరిన్ని వార్తలు