మరోసారి చిక్కుల్లో విప్రో

27 Apr, 2020 16:46 IST|Sakshi

వివక్ష విధానాలను అడ్డుకోండి -విప్రో మాజీ ఉద్యోగుల దావా

న్యూజెర్సీ కోర్టునాశ్రయించిన మాజీ ఉద్యోగులు అయిదుగురు

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రముఖ ఐటీ సేవల  సంస్థ విప్రో  మరోసారి చిక్కుల్లో పడింది. తమపై జాతి వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ అయిదుగురు మాజీ ఉద్యోగులు సంస్థపై దావా వేశారు. 2020 మార్చి 30 న  న్యూజెర్సీ జిల్లా కోర్టులో వీరు తాజా క్లాస్ యాక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. దక్షిణ ఆసియన్లు, భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని, విప్రో అనుసరిస్తున్న ఈ వివక్ష కారణంగా తాము ఉద్యోగాలు కోల్పోయామని వాదించారు. అమెరికాలో ఉన్న దక్షిణ ఆసియన్లు, భారతీయులు కానివారికి అప్రైజల్ స్కోర్క్ ఇవ్వడంలేదని, అలాగే వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన వీరిలో అధిక సంఖ్యలో ఉద్వాసనకు గురవుతున్నారని ఆరోపించారు.

దక్షిణ ఆసియన్లు, భారతీయులం కాదనే నెపంతో సంస్థ తమపై 'జాతి వివక్ష' చూపిస్తోందని అమెరికాలోని ఐదుగురు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. ఉద్యోగులపై పదోన్నతులు,  జీతం పెంపు, తొలగింపు నిర్ణయాలకు సంబంధించి  తేడాలు చూపిస్తోందన్నారు. దీని ఫలితంగా తాము ఉద్యోగాల్ని కోల్పోయామని పేర్కొన్నారు. నియామకం, పదోన్నతి ఇతర  నిర్ణయాల్లో వివక్షత లేని పద్ధతిని అవలంబించాలనే ఆదేశాలతో పాటు, ఫెడరల్ రూల్స్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ప్రకారం , చట్టవిరుద్ధమైన విధానాలలో పాల్గొనకుండా శాశ్వత నిషేధానికి అనుగుణంగా దావాను 'క్లాస్ యాక్షన్' గా వర్గీకరించాలని కోర్టును కోరారు.  గత పదేళ్లుగా  విప్రోలో పని చేసిన ఐదుగురు మాజీ ఉద్యోగులు నలుగురు కాకేసియన్ మూలానికి , మరొకరు హిస్పానిక్ మూలానికి చెందినవారుగా భావిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామంపై వ్యాఖ్యానించేందుకు విప్రో  తిరస్కరించింది.  కాగా గత సంవత్సరం డిసెంబరులో ఆఫ్రికాకు చెందిన అమెరికా ఉద్యోగి ఇలాంటి దావావేయడంతో, పరిహారం ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించిన  సంగతి  తెలిసిందే.  (ప్రతీరోజు 20 లక్షల మందికి ఆహారం : విప్రో)

చదవండి : జియో మార్ట్ వాట్సాప్ నంబరు ఇదే!
  

>
మరిన్ని వార్తలు