వోడాఫోన్‌ ఐడియా చెల్లింపులు, షేరు జూమ్‌

20 Feb, 2020 15:00 IST|Sakshi

మరో రూ.1000 కోట్లు చెల్లించిన వోడాఫోన్‌ ఐడియా

సోమవారం రూ.2500 కోట్లు చెల్లించిన వోడాఫోన్‌ ఐడియా 

సంస్థ మొత్తం బకాయి రూ .53 వేల కోట్లు

సాక్షి, న్యూఢిల్లీ: వోడాఫోన్‌ ఐడియా ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల్లో భాగంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌(డాట్‌)కు గురువారం మరో రూ.1000 కోట్లు చెల్లించింది. ఏజీఆర్‌ బాకీలకు సంబంధించి సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సోమవారం వోడాఫోన్‌ ఐడియా డీఓటీకు రూ.2500 కోట్లను  చెల్లించిన సంస్థ తాజాగా మరో దఫా చెల్లింపులు చేసింది.  డీఓటీ గణాంకాల బట్టి సవరించి స్థూల ఆదాయం లెక్కల ప్రకారం టెల్కో నుంచి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ ఛార్జీల బాకీల కింద వోడాఫోన్‌ ఐడియా రూ.53వేల కోట్లను చెల్లించాల్సి ఉంది.

 ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించి  మరో దిగ్గజ టెల్కో భారతి ఎయిర్‌టెల్‌ రూ.10వేల కోట్లన ఇప్పటికే చెల్లించిన సంగతి తెలిసిందే. అలాగే టాటా టెలిసర్వీసెస్‌ మొత్తం రూ.14వే కోట్లు చెల్లించాల్సి ఉండగా, సోమవారం  రూ.2,197 కోట్లను చెల్లించింది.  మరోవైపు ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తి బకాయిల రికవరీ కోసం టాటా టెలిసర్వీస్‌కు నోటీసులు కూడా పంపుతామని డిఓటి వర్గాలు తెలిపాయని పీటీఐ తెలిపింది. మరోవైపు వొడాఫోన్ ఐడియా షేర్లు 18.85 శాతం పెరిగి బిఎస్‌ఇలో రూ .4.98 ను తాకింది.

చదవండి :  రూ.10 వేల కోట్లు కడతాం

ఏజీఆర్‌ : వోడాఫోన్‌ ఐడియా కీలక నిర్ణయం

>
మరిన్ని వార్తలు