పశ్చిమ తీరంలో భారీ రిఫైనరీ

27 Jan, 2016 00:25 IST|Sakshi
పశ్చిమ తీరంలో భారీ రిఫైనరీ

రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: పశ్చిమ తీరంలో భారీ రిఫైనరీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఈఐఎల్ చేతులు కలుపుతున్నాయి. ఇవి దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతి పెద్ద రిఫైనరీని నెలకొల్పనున్నాయని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

మహారాష్ట్రలో దాదాపు 60 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో రెండు దశల్లో దీన్ని నిర్మించనున్నట్లు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్వీటర్‌లో ఆయన తెలిపారు. తొలి దశలో రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు ఉంటాయని, 40 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో నిర్మాణం జరుగుతుందని మంత్రి వివరించారు.

ఐవోసీఎల్ రిఫైనరీల్లో చాలా వరకూ ఉత్తరాదినే ఉన్నాయి. ఫలితంగా పశ్చిమ, దక్షిణ ప్రాం తాల కస్టమర్లకు సేవలు అందించడం కష్టమవుతున్నందున అనువైన ప్రదేశం కోసం అన్వేషించిన ఐవోసీఎల్ ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. ఈ రిఫైనరీలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, ఏటీఎఫ్ మొదలైనవి ఉత్పత్తి కానున్నాయి.

>
మరిన్ని వార్తలు