ఫొటోలు, వీడియోల షేరింగ్‌కి ఫేస్‌బుక్ కొత్త యాప్

19 Jun, 2014 00:34 IST|Sakshi
ఫొటోలు, వీడియోల షేరింగ్‌కి ఫేస్‌బుక్ కొత్త యాప్

న్యూయార్క్: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ తాజాగా స్లింగ్‌షాట్ పేరిట కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇతరులు పంపిన కంటెంట్‌ను చూడాలంటే స్లింగ్‌షాట్ యూజర్లు తాము కూడా ఏదైనా కంటెంట్‌ను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది యూజర్లు మరింత సృజనాత్మకంగా ఆలోచించేందుకు, మరిన్ని ఫొటోలూ, వీడియోలు అప్‌లోడ్ చేసేందుకు తోడ్పడుతుందని సంస్థ ప్రోడక్ట్ డిజైనర్ జోయి ఫ్లిన్ తెలిపారు. అవతలివారు చూసిన తర్వాత సదరు కంటెంట్ సిస్టమ్ నుంచి ఆటోమేటిక్‌గా తొలగిపోతుంది. ప్రత్యేక ఆప్షన్‌ని ఎంచుకుంటే తర్వాత కూడా చూసుకునే వీలుంటుంది

మరిన్ని వార్తలు