జూలై దాకా షా కమిటీ గడువు పొడిగింపు

23 Mar, 2016 01:58 IST|Sakshi
జూలై దాకా షా కమిటీ గడువు పొడిగింపు

న్యూఢిల్లీ: కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తికి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీల మధ్య వివాదంపై ఏర్పాటైన షా కమిటీ గడువును జూలై దాకా పొడిగించినట్లు చమురు శాఖ అధికారి ఒకరు తెలిపారు. రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థ నికో రిసోర్సెస్ ఫిబ్రవరి 19న విచారణ కమిటీ ముందుకు వచ్చాయని, భారీ పరిమాణంలో పత్రాలు సమర్పించాయని వివరించారు. వీటిని అధ్యయనం చేయాల్సి ఉన్నందున గడువు పొడిగించాలని కమిటీ కోరిందని, దానికి అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. పొరుగున ఉన్న ఓఎన్‌జీసీ క్షేత్రం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు రూ. 11,000 కోట్ల విలువ చేసే గ్యాస్‌ను తోడేసిందని ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే జస్టిస్ (రిటైర్డ్) ఏపీ షాతో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది చమురు శాఖ.

మరిన్ని వార్తలు