ఆధార్‌–పొదుపు.. లింక్‌కు గడువు పెంపు

9 Jan, 2018 01:13 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆధార్, చిన్న మొత్తాల పొదుపు పథకాల అనుసంధాన గడువును మూడు నెలలపాటు పొడిగించింది. దీంతో 2018 మార్చి 31 వరకు రెండింటినీ అనుసంధానం చేసుకోవచ్చు. ఆధార్‌ నంబర్‌ను అందించేందుకు నిర్దేశించిన 2017 డిసెంబర్‌ 31 గడువును ఇప్పుడు 2018 మార్చి 31 వరకు పొడిగిస్తున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో పోస్ట్‌ ఆఫీస్‌ డిపాజిట్స్, పీపీఎఫ్, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ స్కీమ్, కిసాన్‌ వికాస్‌ పత్రాలు వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలను ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటికన్నా ముందు నుంచి ఉన్న డిపాజిటర్లకు ఆధార్‌ నంబర్‌ అనుసంధానానికి డిసెంబర్‌ 31ని గడువుగా నిర్దేశించింది.

>
మరిన్ని వార్తలు