సైబర్‌ సెక్యూరిటీలో ఇండియా ర్యాంకు ఎంతో తెలిస్తే..

9 Feb, 2019 13:07 IST|Sakshi

25శాతం కంప్యూటర్లు, 21శాతం  ఫోన్లపై  మాలావేర్‌  దాడులు

టాప్‌లో జపాన్‌, అట్టడుగున అల్జీరియా

60 దేశాల్లో అధ్యయనం చేసిన కంపారిటెక్‌

భారతదేశంలో సైబర్‌ సెక్యూరిటీలో అధ్వాన్న స్థితిలో నిలిచిందని సెబర్‌ సెక్యూరిటీ  స్టడీ  ప్రకటించింది. దేశంలోని 25 శాతం ఫోన్లు, 21శాతం కంప్యూటర్లు మాలావేర్‌ బారిన పడుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. సైబర్ రక్షణ -సంబంధిత అప్‌డేటెడ్‌ చట్టాలు, మాలావేర్‌ ఎటాక్‌, సైబర్-దాడులకు సంసిద్ధత లాంటి అంశాలపై  యూకేకు చెందిన  టెక్నాలజీ పరిశోధనా సంస్థ కంపారిటెక్‌  60దేశాల్లో  ఈ సర్వే నిర్వహించింది. ఇందులో ఇండియా 46వ స్థానంలో నిలిచింది. 

ప్రపంచంలోని అత్యంత సైబర్-సురక్షిత దేశంగా  జపాన్  నిలిచింది. కేవలం 1.34శాతం ఫోన్లు, 8 శాతం కంప్యూటర్లు మాత్రమే సెబర్‌ దాడులకు గురవుతున్నాయి సర్వే వెల్లడించింది.  సైబర్‌ దాడులు నిరోధం, చట్టాలులాంటి అంశంలో తప్ప మిగిలిన అన్ని అంశాల్లో మెరుగా వుందని తెలిపింది. ఈ జాబితాలో ఫ్రాన్స్‌, కెనడా, డెన్మార్క్‌, అమెరికా తరువాతి స్థానాల్లో నిలిచాయి.  పాకిస్థాన్, చైనా రెండూ సైబర్-సెక్యూరిటీలో అధ్వాన్నంగా ఉన్నప్పటికీ భారతదేశం మొత్తం స్కోరులో 39 శాతం సాధించిందని రిపోర్టు పేర్కొంది.  సైబర్‌దాడులకు సంబంధించి   ఈ జాబితాలో  అల్జీరియా అట్టడుగున నిలిచింది.  అలాగే సరైన చట్టాలు,రక్షణ చర్యలు  లేని కారణంగా ఇండోనేషియా, వియత్నం, టాంజానియా, ఉజ్బెకిస్తాన్‌  ఎక్కువ దాడులకు గురవుతున్నాయని  నివేదించింది. 
 

మరిన్ని వార్తలు