రత్నగిరి ప్రాజెక్టులోకి  ‘అబుదాబి ఆయిల్‌’

26 Jun, 2018 00:53 IST|Sakshi

సౌదీ అరామ్‌కోతో కలసి 50 శాతం వాటా 

2025 నాటికి ప్రాజెక్టు మొదలు

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని రత్నగిరిలో 44 బిలియన్‌ డాలర్లతో (రూ.3 లక్షల కోట్లు) 2025  నాటికి ఏర్పాటు చేస్తున్న 60 మిలి యన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో కూడిన రిఫైనరీ, 18 మిలియన్‌ టన్నుల పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ప్రాజెక్టులో సౌదీ అరామ్‌కో నుంచి కొంత వాటా తీసు కునేం దుకు వాటా తీసుకునేందుకు అబు దాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ (ఏడీఎన్‌వోసీ) ముందుకు వచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేసింది. దీనితో ప్రాజెక్టులో సౌదీ అరామ్‌కో, ఏడీఎన్‌వోసీ మొత్తంగా 50 శాతం వాటా తీసుకుంటాయి.

ఈ ప్రాజెక్టు ద్వారా భారత ఇంధన మార్కెట్, రిటైల్‌ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు అవకాశంగా ఏడీఎన్‌వోసీ భావిస్తోంది. ఈ ప్రాజెక్టులో మిగిలిన 50%వాటా  ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ పంచుకుంటాయి. ప్రపంచంలో  వేగంగా వృద్ధి చెందుతున్న ఇంధన విని యోగ మార్కెట్‌ భారత్‌లో సౌదీ అరేబియా, యూఏఈలకు ఇది వ్యూహాత్మక వ్యాపార పెట్టుబడిగా సౌదీ అరామ్‌కో సీఈవో, ప్రెసిడెంట్‌ అమిన్‌ హెచ్‌ నాసర్‌ పేర్కొన్నారు. కాగా ప్రతిపాదిత ఉమ్మడి 50 శాతం వాటాలో ఎవరెంత కలిగి ఉండాలన్న దానిపై చర్చించాల్సి ఉందని నాసర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు