జేపీ జల విద్యుత్ కేంద్రాలు టీఏక్యూఏ చేతికి!

3 Mar, 2014 08:24 IST|Sakshi
జేపీ జల విద్యుత్ కేంద్రాలు టీఏక్యూఏ చేతికి!

న్యూఢిల్లీ/అబుదాబి: దేశీయ సంస్థ జైప్రకాష్ పవర్ వెంచర్స్‌కు చెందిన రెండు జల విద్యుత్ కేంద్రాలను అబుదాబి నేషనల్ ఎనర్జీ కంపెనీ(టీఏక్యూఏ) ఆధ్వర్యంలో ఏర్పాటైన కన్సార్షియం కొనుగోలు చేయనుంది. ఇందుకు 160 కోట్ల డాలర్లను(రూ. 10,000 కోట్లు) చెల్లించనున్నట్లు టీఏక్యూఏ తెలిపింది. దీనిలో ఈక్విటీ రూపేణా 61.6 కోట్ల డాలర్లను(రూ. 3,820 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. మిగిలిన మొత్తం ప్రధానంగా సెక్యూర్డ్(నాన్‌రికోర్స్) రుణం రూపేణా ఉంటుందని తెలిపింది. డీల్‌లో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని కినౌర్ జిల్లాలోగల బాస్పా రెండో దశ, కర్చాం వాంగ్‌టూ ప్లాంట్లను సొంతం చేసుకోనుంది.

వీటి సంయుక్త విద్యుదుత్పత్తి సామర్థ్యం 1,391 మెగావాట్లుకాగా, ఈక్విటీ పెట్టుబడులలో టీఏక్యూఏ 51% వాటాను సమకూరుస్తుంది. త ద్వారా రెండు జల విద్యుత్ ప్లాంట్లకు సంబంధిం చిన యాజ మాన్యం, కార్యకలాపాల నిర్వహణలను అబుదాబీ నేషనల్ ఎనర్జీ కంపెనీ సొంతం చేసుకోనుంది. కన్సార్షియంలో కెనడాకు చెందిన సంస్థాగత ఇన్వెస్టర్ సంస్థకు(పేరు వెల్లడించలేదు) 39% వాటా, ఐడీఎఫ్‌సీ ఆల్టర్నేటివ్స్ ఇండియా ఇన్‌ఫ్రా ఫండ్‌కు 10% వాటా ఉంటుందని టీఏక్యూఏ వివరించింది. ఈ కొనుగోలు ద్వారా ఇండియా జల విద్యుత్ రంగంలో తాము అతిపెద్ద ప్రయివేట్ కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు టీఏక్యూఏ తెలిపింది.

మరిన్ని వార్తలు