రేటింగ్‌ సెగ : కుప్పకూలిన అడాగ్‌ షేర్లు

30 Apr, 2019 14:51 IST|Sakshi

సాక్షి,ముంబై :  అనిల్‌ అంబానీకి చెందిన అడాగ్‌ షేర్లకు  రేటింగ్‌షాక్‌  తగిలింది. అనిల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన కంపెనీల షేర్లు 20 శాతానికిపైగా నష్టపోయాయి.  రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ పవర్‌ కౌంటర్లలో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. 

రేటింగ్‌ సంస్థలు కంపెనీల షేర్లపై రేటింగ్‌ను డౌన్‌లోడ్‌ చేయడం, ఆయా కంపెనీలు ఎదుర్కోంటున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి అమ్మకాలు వెల్లువెత్తాయి.  ముఖ్యంగా రిలయన్స్‌ పవర్‌ 20 శాతం నష్టపగా రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ 18 శాతం, రిలయన్స్‌ క్యాపిటల్‌ 12 శాతం, రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ 10 శాతం, రిలయన్స్‌  నావెల్‌ అండ్‌ ఇంజనీరింగ్స్‌ 6 శాతం, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ 7 శాతం నష్టపోయాయి. 

రిలయన్స్ పవర్ స్టాక్స్ ఆల్‌ టైం కనిష్టానికి పడిపోయాయి. మొన్నటి  ట్రేడింగ్‌ సెషన్లో జరిగిన ఓ 5 బ్లాక్‌ డీల్స్ ద్వారా 80లక్షల  రిలయన్స్ పవర్ షేర్లు చేతులు మారినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పలితంగా నేటి ట్రేడింగ్‌లో దాదాపు 20.17శాతం నష్టంతో రిలయన్స్ పవర్ స్టాక్స్  ఆల్ టైం కనిష్టానికి పడిపోయాయి. కేర్, ఇక్రా రేటింగ్ సంస్థలు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కు డిఫాల్ట్ రేటింగ్‌ను ఇవ్వడంతో ఈ కంపెనీ షేర్లు నేటి ట్రేడింగ్‌లో పదిశాతం క్షీణించాయి.

మరిన్ని వార్తలు