అదానీ ఆదాయం రూ.167 కోట్లు

5 May, 2016 02:24 IST|Sakshi
అదానీ ఆదాయం రూ.167 కోట్లు

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదాని ఎంటర్‌ప్రైజెస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.167 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్)ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-15)లో రూ.732 కోట్ల నికర లాభం ఆర్జించామని అదాని ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది. గత క్యూ4లో మొత్తం ఆదాయం రూ.10,950 కోట్లుగా ఉందని, అంతకు ముందటి క్యూ4లో మొత్తం ఆదాయం రూ.16,141 కోట్లని పేర్కొంది. పోర్టులు, విద్యుత్తు, ట్రాన్సిమిషన్ వ్యాపారాలను డీమెర్జ్ చేసినందున ఈ ఫలితాలను పోల్చడానికి లేదని కంపెనీ పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి వస్తే మొత్తం ఆదాయం 2015-16లో రూ.44,023 కోట్లని, ఇబిటా 3,114 కోట్లని,  నికర లాభం రూ.1,041 కోట్లని పేర్కొంది.

 రూ.6,000 కోట్ల నిధుల సమీకరణకు బోర్డ్ ఓకే: ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నందువల్ల తమ మైనింగ్, నవీకరణ ఇంధన వనరులు, వ్యవసాయ రంగ విభాగాలు ప్రయోజనాలు పొందుతాయని అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు. షేర్లు, లేదా కన్వర్టబుల్ బాండ్ల జారీ ద్వారా రూ.6,000 కోట్ల నిధుల సమీకరణ కోసం కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం పొందామని కంపెనీ పేర్కొంది.

>
మరిన్ని వార్తలు