ఇకపై ఆ తలనొప్పి వాట్సప్‌లోనూ..!

7 Jan, 2020 10:20 IST|Sakshi

న్యూఢిల్లీ: రోజురోజుకూ వాట్సప్‌ వాడుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. స్మార్ట్‌ఫోన్‌ కొనే చాలామంది మొదట ఇన్‌స్టాల్‌ చేసే యాప్‌ వాట్సప్‌ అంటే అతిశయోక్తి కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాట్సప్‌ సంస్థ కూడా ఈ ఏడాదిలో విడుదల చేసే ముఖ్యమైన ఫీచర్లలో స్టేటస్‌ యాడ్స్‌ ఫీచర్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాదిరిగానే వాట్సాప్‌లో కూడా యూజర్లకు యాడ్స్‌ కనిపించనున్నాయి. ఇప్పటిదాకా కొన్నింటికే పరిమితమైన ఈ యాడ్‌లు ఇకపై వాట్సప్‌లో కూడా డిస్‌ప్లే అవుతాయని నెదర్లాండ్‌లో జరిగిన ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌ సమ్మిట్‌ 2019లో ఆ సంస్థ వెల్లడించింది. కాకపోతే ఈ యాడ్స్‌ ఫీచర్‌ ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై మాత్రం ఆ కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా