ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ చేతికి జేపోర్‌ బ్రాండ్‌

11 Jun, 2019 05:51 IST|Sakshi

డీల్‌ విలువ రూ.110 కోట్లు

ముంబై: ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ (ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌) కంపెనీ ఎథ్నిక్‌ వేర్‌ బ్రాండ్స్‌– జేపోర్, టీజీ అప్పారెల్‌ అండ్‌ డెకార్‌లను కొనుగోలు చేస్తోంది. జేపోర్‌ బ్రాండ్‌ను రూ.110 కోట్లకు, టీజీ అప్పారెల్‌ అండ్‌ డెకార్‌ బ్రాండ్‌ను  రూ.25 కోట్లకు కొనుగోలు చేయనున్నామని ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ తెలిపింది. ఈ డీల్‌ 30– 45 రోజుల్లో పూర్తవ్వగలదని  పేర్కొంది. ఎథ్నిక్‌  అప్పారెల్, యాక్సెసరీల విభాగంలో మరింత పటిష్టవంతం కావడానికి ఈ బ్రాండ్స్‌ను కొనుగోలు చేస్తున్నామని వివరించింది.  2012లో ఆరంభమైన జేపోర్‌ బ్రాండ్‌... చేతితో తయారు చేసిన దుస్తులను, ఆభరణాలను, హోమ్‌ టెక్స్‌టైల్స్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.39 కోట్ల ఆదాయం ఆర్జించింది. టీజీ అప్పారెల్‌ అండ్‌ డెకోర్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.34 కోట్ల టర్నోవర్‌ను సాధించింది.

దేశవ్యాప్తంగా 2,714 బ్రాండ్‌ స్టోర్స్‌.....
ఈ రెండు బ్రాండ్ల కొనుగోళ్లతో బ్రాండెడ్‌ ఫ్యాషన్‌ స్పేస్‌లో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని ఎబీఎఫ్‌ఆర్‌ఎల్‌ ఎమ్‌డీ,, అశీష్‌ దీక్షిత్‌ పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌ దేశవ్యాప్తంగా 750 నగరాల్లో 2,714 బ్రాండ్‌ స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. లూయూ ఫిలప్, వాన్‌ హ్యూసెన్, అలెన్‌ సోలే, పీటర్‌ ఇంగ్లాండ్‌ వంటి బ్రాండ్ల దుస్తులను విక్రయిస్తోంది. పాంటలూన్స్‌ పేరుతో వేల్యూ ఫ్యాషన్‌ స్టోర్‌ బ్రాండ్‌ను కూడా నిర్వహిస్తోంది. ద కలెక్టివ్, టెడ్‌ బేకర్, రాల్ఫ్‌ లూరెన్, అమెరికన్‌ ఈగిల్, సిమన్‌ కార్టర్‌ వంటి ఇంటర్నేషనల్‌ బ్రాండ్లను కూడా విక్రయిస్తోంది. బ్రాండ్ల కొనుగోళ్ల వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ షేర్‌ 0.3 శాతం లాభంతో రూ.219 వద్ద ముగిసింది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

సీమెన్స్‌ : భారీ ఉద్యోగాల కోత

ఈడీ కొరడా : రూ.1610 కోట్ల వాహనాలు సీజ్‌

‘ఆర్‌వీ400’ ఎలక్ట్రిక్‌ బైక్‌ ఆవిష్కరణ

గో ఎయిర్‌ చౌక ధరలు

ఎన్‌సీఎల్‌టీ ముంగిట జెట్‌

వారికి షాకే : ఇక షాపింగ్‌ మాల్స్‌లో పెట్రోల్‌

ట్రంప్‌ వల్ల బాదంపప్పు రైతులకు నష్టాలు..

బొలెరో విక్రయాల్లో 12 శాతం వృద్ధి

మెగా బీమా సంస్థ

వాట్సాప్‌ చాలెంజ్‌లో 5 స్టార్టప్‌ల ఎంపిక

ఆసియా కరెన్సీల లాభాల మద్దతు

స్టాక్‌ మార్కెట్ల జోరు : ట్రిపుల్‌ సెంచరీ లాభాలు

ఓ అసమర్ధుడి వ్యాపార యాత్ర...

అనిల్‌ అంబానీపై మరో పిడుగు

21న జీఎస్టీ కౌన్సిల్‌ కీలక భేటీ

ఎంఐ డేస్‌ సేల్‌: షావోమి బెస్ట్‌ డీల్స్‌ 

బిలియనీర్‌ క్లబ్‌నుంచి అంబానీ ఔట్‌

వాణిజ్య యుద్ధ భయాలు

ఫ్రీగా అయితే చూసేస్తాం!!

షార్ట్‌ కవరింగ్‌ : లాభాల్లో సూచీలు

ఎయిర్‌టెల్, వొడా, ఐడియాలకు రూ.3,050 కోట్ల పెనాల్టీ!

టారిఫ్‌లపై దూకుడు వద్దు!!

మార్కెట్లోకి టాటా ‘టిగోర్‌’ ఆటోగేర్‌

జెట్‌ ఎగరడం ఇక కలే!

ఫేస్‌బుక్‌ నుంచి కొత్త క్రిప్టో కరెన్సీ

వృద్ధి స్పీడ్‌కు ఫిచ్‌ రెండోసారి బ్రేక్‌లు!

మన డేటా మన దగ్గరే ఉండాలి..

నుబియా నుంచి అధునాతన గేమింగ్‌ ఫోన్‌

అజయ్‌ పిరమళ్‌ చేయి వేస్తే...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చంటబ్బాయ్‌ ఇష్టం

బీచ్‌ బేబి

ఆగస్ట్‌ నుంచి నాన్‌స్టాప్‌గా...

మాటల్లో చెప్పలేనిది!

ఆ నగ్న సత్యమేంటి?

ర్యాంకు రాకపోతే..!