ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ లాభం 13 శాతం డౌన్‌

7 Nov, 2018 00:37 IST|Sakshi

రూ.3,590 కోట్లకు పెరిగిన మొత్తం ఆదాయం  

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.195 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.225 కోట్ల నికర లాభం వచ్చిందని, 13 శాతం క్షీణత నమోదైందని ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,699 కోట్ల నుంచి రూ.3,590 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 

ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఆర్థిక సేవల వ్యాపారాల హోల్డింగ్‌ కంపెనీగా ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ వ్యవహరిస్తోంది. ఈ కంపెనీ జీవిత బీమా, అసెట్‌ మేనేజ్‌మెంట్, ప్రైవేట్‌ ఈక్విటీ, కార్పొరేట్‌ లెండింగ్, ప్రాజెక్ట్‌ ఫైనాన్స్, సాధారణ బీమా, బ్రోకింగ్, వెల్త్‌ మేనేజ్‌మెంట్, ఈక్విటీ, కరెన్సీ, కమోడిటీ బ్రోకింగ్, ఆన్‌లైన్‌ పర్సనల్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్, తదితర సేవలందిస్తోంది.  ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ షేర 1 శాతం లాభపడి రూ.107 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు