వ్యాపారులూ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి!

12 Oct, 2015 00:48 IST|Sakshi
వ్యాపారులూ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి!

ఆదాయపు పన్ను శాఖ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: మరింత మందిని పన్ను పరిధిలోనికి తెచ్చే వ్యూహాంలో భాగంగా ఆదాయపు పన్ను విభాగం పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను పరిధిలోనిరి కొత్తగా కోటిమందిని తీసుకురావాలని ఐటీ విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధన కోసం  ట్రేడర్లు, వ్యాపారులు వార్షిక రిటర్న్‌లు కాకుండా ముందస్తుగా పన్నులు చెల్లించాలని, ఇలా చేయడం వల్ల వారిని అసెస్సీలుగా పరిగణిస్తామని, తమ లక్ష్యం కూడా నెరవేరే అవకాశాలున్నాయని పేర్కొంది.

ఆదాయపు పన్ను సంబంధిత అపోహలను తొలగించడానికి  పరిశ్రమ, వాణిజ్యవేత్తలతో సీదా సంవాద్(నేరుగా సంభాషణ) కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కు మించి పన్ను బాధ్యత ఉండే ప్రతీ వ్యక్తి మందస్తుగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు