ఆఫిల్‌ ఇండియా ఐపీఓ... అదుర్స్‌ !

1 Aug, 2019 12:41 IST|Sakshi

86 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌

ఈ నెల 8న లిస్టింగ్‌  

న్యూఢిల్లీ: మొబైల్‌ మార్కెటింగ్‌ కంపెనీ, ఆఫిల్‌ ఇండియా ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) 86 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. బుధవారం ముగిసిన ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్‌ రూ.740–745గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.459 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఐపీఓలో భాగంగా రూ.90 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఆఫర్‌ ఫర్‌సేల్‌ కింద 49.53 లక్షల షేర్లను కూడా విక్రయిస్తారు. ఐపీవోలో సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా 55 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల వాటా 199 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 11 రెట్లు చొప్పున సబ్‌స్క్రైబయ్యాయి. ఈ నెల 8న ఆఫిల్‌ ఇండియా కంపెనీ  స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతుంది. ఈ కంపెనీ గత శుక్రవారమే యాంకర్‌ ఇన్వెస్టర్ల ద్వారా రూ.207 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, నొముర ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌(ఇండియా) వ్యవహరిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు