సుంకం కోత : వివిధ నగరాల్లో పెట్రో ధరలు

5 Oct, 2018 08:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోలు డీజిలు ధరలపై కేంద్రం  సుంకం తగ్గింపు అనంతరం మెట్రో నగరాల్లో పెట్రో ధరలు శుక్రవారం కాస్త ఉపశమించాయి.  ముఖ్యంగా అత్యధిక ధరలను నమోదు చేసిన వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోలు ధర లీటరు రూ. 86.97,  డీజిల్‌ ధర రూ.77.45 గా ఉంది. ఢిల్లీలో  పెట్రోలు ధర  81.50 రూపాయలుగాను, డీజిల్‌ ధర రూ. 72.50గా ఉంది.  

హైదరాబాద్‌:  పెట్రోలు ధర లీటరుకు రూ. 86.40  డీజిల్ ధర లీటరుకు 79.35 రూపాయలుగా ఉంది.
విజయవాడ:  పెట్రోలు ధర లీటరుకు రూ. 84.50  డీజిల్ ధర లీటరుకు 77.11 రూపాయలుగా ఉంది.
చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 84.70  డీజిల్ ధర లీటరుకు 77.11 రూపాయలు
కోలకతా: పెట్రోలు లీటరుకు  83.35 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర లీటరుకు  రూ. 74.80
బెంగళూరు : పెట్రోలు లీటరుకు రూ. 82.14, డీజిల్ ధర లీటరుకు 73.32 రూపాయలుగా ఉంది.
రాంచీ  : జార్ఖండ్ రాజధాని పెట్రోల్ ధర రూ. 77.91 వద్ద ఉండగా, డీజిల్ రూ .74.51
గురుగ్రామ్‌:  పెట్రోలు ధర లీటరుకు 80.20 రూపాయల మేరకు గుర్గావ్, డీజిల్  రూ. 71.86
చండీగఢ్:  పెట్రోలు ధర రూ .78.45,   డీజిల్ రూ .70.93
గౌహతి : పెట్రోలు లీటరుకు రూ .78.50, డీజిల్కు రూ. 70.97
భూపాల్ :  పెట్రోలు ధర లీటరుకు రూ. 84.69 డీజిల్ లీటరుకు 74.33 రూపాయలు

కాగా  పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.2.50 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ  గురువారం ప్రకటించారు. అదేవిధంగా   సుంకాన్ని తగ్గించాల్సిందిగా ఆయన రాష్ట్రాలకు కూడా  సూచించారు.  గుజరాత్‌, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్‌, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, అసోం, ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, త్రిపుర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌పై విధిస్తున్న సుంకాన్ని రూ.2.50చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి  తెలిసిందే.

మరిన్ని వార్తలు