ప్రైవేట్‌ బ్యాంకులకు షాక్‌: ఏఐబీఓసీ సంచలన డిమాండ్‌

6 Apr, 2018 18:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్‌ఫెడరేషన్‌ (ఏఐబీఓసీ)   సంచలన డిమాండ్‌ చేసింది. ప్రయివేటు రంగ బ్యాంకుల్లో సంక్షోభం, వివిధ కుంభకోనాల నేపథ్యంలో  దేశంలోని ప్రయివేటు బ్యాంకులను జాతీయం చేయాలంటూ  డిమాండ్‌  చేసింది. ప్రతి ఏడాది కార్పొరేట్‌ సెక్టారుకు ఇస్తున్న కోట్లాది రూపాయల రుణాలను రద్దు చేస్తున్న నేపథ్యంలో  ఈ డిమాండ్‌తో ముందుకు వచ్చింది.  కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ   ఈ వ్యవహారంలో కల్పించుకోవాలని కోవాలని కోరింది.  ఈ బ్యాంకులను జాతీయ చేయడం ద్వారా  ఆర్థిక వృద్ధికి తోడ్పడాలని  సూచించింది.  అంతేకాదు జాతీయం చేయడం వలన  వ్యవసాయరంగ అభివృద్ధితోపాటు ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశం కలుగుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు ఏఐబీఓసీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ముఖ్యంగా పార్లమెంటుకు అందించిన సమాచారం ప్రకారం గత మూడేళ్ల కాలంలో రూ.2లక్షల 41వేల కోట్ల రుణాలను రద్దు చేసిన వైనాన్ని పేర్కొన్న  సంస్థ  బడా బాబులు  కోట్ల  రూపాయల రుణాలను  పొందుతున్నారు.  ఫలితంగా మొండి బకాయిలు పేరుకుపోతున్నాయంటూ, ఇందుకు యాక్సిస్‌,  ఐసీఐసీఐ బ్యాంకును ఉదాహరణగా పేర్కొంది. దీంతో కుటీర పరిశ్రమలు,  చిన్నసంస్థలు, రైతులు రుణాలు లభించక ఇబ్బందులు పడుతున్నారని ఏఐబీఓసీ  వాదించింది. అలాగూ స్టార్ట్‌ అప్‌ సంస్థలకూడా రుణాల కొరతను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. ఈ సందర్భంగా 1969లో 14  ప్రయివేటు బ్యాంకులను,1980లో మరో ఆరు బ్యాంకులను జాతీయం చేసిన సంగతిని గుర్తు చేసింది. 

మరిన్ని వార్తలు