నాలుగు కంపెనీలుగా ఎయిరిండియా

15 Jan, 2018 19:06 IST|Sakshi

న్యూఢిల్లీ : నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియాను అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ అమ్మకానికి ముందే ఎయిరిండియాను నాలుగు కంపెనీలుగా విడదీయాలని కూడా ప్రభుత్వం ప్లాన్‌ చేస్తుంది.  ఇలా విడదీసిన ప్రతి కంపెనీలో  పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కింద కనీసం 51 శాతం ఆఫర్‌ చేయాలని చూస్తుందని బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది.  కోర్‌ ఎయిర్‌లైన్‌ బిజినెస్‌‌, రీజనల్‌ ఆర్మ్‌, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌, ఇంజనీరింగ్ ఆపరేషన్లుగా విడదీయాలని ప్రభుత్వం చూస్తుందని రిపోర్టు పేర్కొంది. కోర్‌ ఎయిర్‌లైన్‌ బిజినెస్‌ల్లో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, లో-కాస్ట్‌ ఓవర్‌సీస్‌ ఆర్మ్‌ ఉండనుంది. 2018 చివరి వరకు ఈ ప్రక్రియ ముగియనుందని జూనియర్‌ ఏవియేషన్‌ మంత్రి జయంత్‌ సిన్హా చెప్పినట్టు బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది.

ఇటీవలే ఎయిరిండియాలో విదేశీ కంపెనీలు 49శాతం పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఎయిరిండియాలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతిపాదించిన వాటాల విక్రయ ప్రక్రియకు తుది విధివిధాలను మంత్రుల గ్రూప్‌ నిర్ణయిస్తోంది. త్వరలోనే బిడ్డర్లను కూడా ఆహ్వనించనున్నట్టు తెలుస్తోంది. కాగ, 55 వేల కోట్లతో ఎయిరిండియా అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇప్ప‌టికే రూ.23 వేల కోట్లను భ‌రించింది. 

మరిన్ని వార్తలు