ఎయిరిండియా ప్రైవేటీకరణ ఒప్పుకోం

9 Jul, 2019 05:39 IST|Sakshi

చైర్మన్‌తో భేటీలో ఉద్యోగ సంఘాల స్పష్టీకరణ

ముంబై: నష్టాలు, రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్రం మరోసారి ప్రయత్నాలు ప్రారంభించడంపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రైవేటీకరణతో అనేక మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందనే భయాలు నెలకొన్న దరిమిలా యాజమాన్యానికి తమ ఆందోళన గురించి తెలియజేశాయి. ప్రైవేటీకరణ ప్రణాళికపై సోమవారం చైర్మన్‌ అశ్వనీ లోహానీతో జరిగిన సమావేశంలో 13 ఉద్యోగ సంఘాలు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలిపాయి.

దాదాపు రెండు గంటల పాటు సాగిన సమావేశంలో .. కంపెనీని మళ్లీ గట్టెక్కించేందుకు తాము అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని, శాయశక్తులా కృషి చేస్తామని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణను ఒప్పుకునేది లేదని స్పష్టం చేశాయి. ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఇటీవలి బడ్జెట్‌లో కేంద్రం కంపెనీకి నామమాత్రంగా రూ.  లక్ష మాత్రమే కేటాయించింది. అలాగే అక్టోబర్‌ లోగా విక్రయ ప్రక్రియ పూర్తి చేయాలని డెడ్‌లైన్‌ కూడా విధించినట్లు వార్తలు వచ్చాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు