డెడ్‌లైన్‌ ముగుస్తున్నా..

30 May, 2018 15:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ ఎయిర్‌ ఇండియా టేకోవర్‌కు డెడ్‌లైన్‌ రేపటితో( మే 31) ముగుస్తున్నా ఇప్పటివరకూ ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాలేదు. జాతీయ ఎయిర్‌లైన్‌ ఎయిర్‌ ఇండియాను చేపట్టేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)కు ఏ సంస్ధ ఇప్పటివరకూ స్పందించలేదు. అయితే చివరినిమిషంలో పెద్దసంఖ్యలో బిడ్స్‌ వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఎయిర్‌ఇండియా టేకోవర్‌కు ఈఓఐని ఇప్పటికే మే 14 నుంచి మే 31వరకూ పొడిగించడంతో డెడ్‌లైన్‌ను మరోసారి పొడిగించే అవకాశం లేదని పౌరవిమానయాన కార్యదర్శి ఆర్‌ఎన్‌ చూబే స్పష్టం చేశారు.

ఎయిర్‌ఇండియాలో 76 శాతం వాటాను విక్రయించి,యాజమాన్య నియంత్రణను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిన సంగతి తెలిసిందే. డెడ్‌లైన్‌ ముగిసేలోగా ఎయిర్‌ ఇండియా టేకోవర్‌కు దీటైన సంస్థ ముందుకువస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.లాభాల బాటలో పయనిస్తున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సింగపూర్‌కు చెందిన శాట్స్‌ లిమిటెడ్‌ జాయింట్‌ వెంచర్‌ ఏఐశాట్స్‌లో కూడా వాటా విక్రయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

మరిన్ని వార్తలు