ముంబై-న్యూయార్క్‌ విమానాలు నిలిపివేత

20 May, 2019 11:02 IST|Sakshi

ముంబై- న్యూయార్క్‌ డైరెక్ట్‌ విమానాలను రద్దు చేసిన ఎయిరిండియా

క్షీణించిన డిమాండ్, నష్టాలు

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ  విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై నుంచి న్యూయార్క్‌  విమాన సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మార్గంలో తగినంత డిమాండ్‌ లేకపోవడంతో ఎయిరిండియా నష్టాల పాలైంది.  దీంతో  ఈ మార‍్గంలో తన విమాన సేవలను నిలిపిస్తోంది.

డిసెంబర్ 2018 లో న్యూయార్క్‌లోని  జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయం నుంచి ముంబై-న్యూయార్క్‌ డైరెక్ట్‌ విమాన సేవలను ప్రారంభించిన సంస్థ డిమాండ్‌ తక్కువగా ఉండటంతో ఇకపై ఈ సర్వీసులను రద్దు చేయనున్నట్టు ప్రకటించింది.  

ముంబై-న్యూయార్క్ మధ్య వారానికి మూడుసార్లు విమాన సర్వీసులను నడిపిస్తున్న ఎయిరిండియా పాకిస్తాన్ ఎయిర్‌ స్పేస్‌ మూసివేత కారణంగా ఫిబ్రవరిలో తాత్కాలికంగా సర్వీసులను నిలిపివేసింది. అయితే జూన్‌లో పునఃప్రారంభించాలని భావించినా.. ఇకపై ఈ సర్వీసులను కొనసాగించలేమని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే వింటర్‌కు సంబంధించి అ‍క్టోబర్‌ మూడవవారం నుంచి మార్చి రెండో వారం వరకు అందించే ఎయిరిండియా విమాన సేవలు ఇందులో భాగం కాదని వివరించారు. 

మరిన్ని వార్తలు