ఎయిర్‌ ఏసియా బిగ్‌ సేల్‌: రూ.999కే సింగపూర్‌

22 May, 2018 10:06 IST|Sakshi
ట్విటర్‌ ఫోటో

సాక్షి, ముంబై: బడ్జెట్‌ క్యారియర్‌ ఎయిర్‌ ఏసియా ఇండియా విమాన టికెట్లపై మరోసారి డిస్కౌంట్‌ ధరలను ప్రారంభించింది.   అదీ అంతర్జాతీయ మార్గంలో ‘బిగ్‌సేల్‌’  పేరుతో తక్కువ ధరలకే విమాన టికెట్లను  ఆఫర్‌ చేస్తోంది.  అదీ అంతర్జాతీయంగా  999 రూపాయలకే విమాన టికెట్లను  ఆఫర్‌ చేస్తోంది. మే21- 27తేదీల మధ్య ఈ ఆఫర్‌లో టికెట్ల బుకింగ్‌ సౌకర్యం  లభ్యం.  ఇలా బుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా నవంబర్‌ 1, 2018నుంచి ఆగస్టు13, 2019 వరకు  ప్రయాణించే అవకాశం. అంతర్జాతీయంగా  కౌలాలంపూర్, బ్యాంకాక్, క్రబీ, సిడ్నీ, ఆక్‌లాండ్, మెల్‌బోర్న్, సింగపూర్, బాలి లాంటి  అన్ని ప్రాంతాల నుంచి రూ. 999 (వన్‌ వే) ప్రారంభ ధరకే టికెట్లను  అందిస్తోంది.  బెంగళూరు, కొచ్చి, గోవా, జైపూర్, చండీగఢ్, పుణె, న్యూఢిల్లీ, గువహతి, ఇంఫాల్, విశాఖపట్నం, హైదరాబాద్, శ్రీనగర్, బాగ్డోగ్ర, రాంచి, కోలకతా, నాగ్‌పూర్‌ ఇండోర్, చెన్నై, సూరత్ ,  భువనేశ్వర్  నుంచి ఈ విదేశీ టికెట్లను ఎంపిక  చేసుకోవచ్చు.

ఎయిర్ ఏసియా ప్రకటించిన ఈ కొత్త ప్రమోషనల్ ఆఫర్‌ కింద ఎయిర్ ఆసియా, ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ విమానాల్లో డిస్కౌంట్ టిక్కెట్లు అందిస్తోంది. ఈ రాయితీ ధరల టిక్కెట్లు www.airasia.com, మొబైల్ యాప్‌  ద్వారా ఆన్‌లైన్‌ బుకింగ్స్‌కు  మాత్రమే లభిస్తాయి. ఎయిర్‌ ఏసియా  గ్రూప్ నెట్‌వర్క్‌లోని ఎయిర్ ఏసియా ఇండియా, ఎయిర్ ఏసియా బెర్హాడ్, థాయ్ ఎయిర్ ఏసియా తదితర ఆపరేటింగ్ సర్వీసుల ద్వారా ఈ ఆఫర్ లభ్యమవుతుంది.

ఎయిర్ ఏసియా  వెబ్‌సైట్‌ లో పొందుపర్చిన సమాచారం  ప్రకారం  గోవా నుండి కౌలాలంపూర్ టికెట్‌ 1999నుంచి ప్రారంభం. కోచి నుండి కౌలాలంపూర్‌కు 3,399 రూపాయలు, విశాఖపట్నం-కౌలాలంపూర్ , గోవా-కౌలాలంపూర్  రూ.5514 , హైదరాబాద్- కౌలాలంపూర్ 4,999 రూపాయలు, జైపూర్-కౌలాలంపూర్ 3,590 రూపాయలు న్యూఢిల్లీ నుంచి కౌలాలంపూర్ రూ.4,290 ప్రారంభ ధరలుగా ఉన్నాయి. భారతదేశం నుండి కౌలాలంపూర్ ద్వారా పయనించే విమానాల్లో కూడా తక్కువ ధరలను ప్రకటించింది.  భువనేశ్వర్-కౌలాలంపూర్-జకార్తా రూ .2,255, భువనేశ్వర్-కౌలాలంపూర్-యోగ్యకార్తా రూ.3,341,  కొచ్చి-కౌలాలంపూర్-బ్రూనే 4,649 రూపాయలు,  కోలకతా-బ్యాంకాక్ - డాన్ మెయంగ్-ఫుకెట్ రూ .5405, హైదరాబాద్-కౌలాలంపూర్-పెనాంగ్ 6,613 రూపాయలు,  జైపూర్-కౌలాలంపూర్ -క్రిబి 5,701 రూపాయలు ప్రారంభ ధరలుగా ఉన్నాయి.  పూర్తి వివరాలు  ఎయిర్‌ ఏసియా అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు