ఇక్కడే విమాన చార్జీలు చౌక

23 Mar, 2017 00:51 IST|Sakshi
ఇక్కడే విమాన చార్జీలు చౌక

ఈ రంగంలో పోటీవల్లే: కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా
ఇంధన ధరలు, పన్నులు ఎక్కువే


న్యూఢిల్లీ: విమాన చార్జీలు చౌకగా ఉన్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా చెప్పారు. విమానాలతో పాటు ఇంధనం ధరలు, పన్నులు కూడా అధికంగా ఉన్నప్పటికీ, అత్యంత పోటీ ధరలున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటని ఆయన తెలియజేశారు. విమానయానం మరింత చౌకగా ఉండేందుకు, సర్వీసులు లేని విమానాశ్రయాల అనుసంధానత కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రాంతీయ అనుసంధానత స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చిందని తెలియజేశారు.

ఈ ఉడాన్‌ (ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌) స్కీమ్‌లో భాగంగా గంట విమాన ప్రయాణానికి రూ.2,500 పరిమితిని విధించామని చెప్పారాయన. ఆల్‌  ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ఏఐఎంఏ) ఇక్కడ నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు.

>
మరిన్ని వార్తలు