ఏఏఐకి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌

22 Aug, 2017 01:27 IST|Sakshi
ఏఏఐకి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌

 30.2 శాతం రెవెన్యూ షేర్‌ ఇస్తానన్నందుకే..  
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించ తలపెట్టిన ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి పనుల ఫైనాన్షియల్‌ బిడ్‌ ఖరారైంది. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఈ టెండర్‌ను దక్కించుకున్నట్టు ఏపీ మౌలిక వసతుల విభాగం ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసిన సంస్థకే దాని వాణిజ్య కార్యాకలాపాలపై సర్వాధికారాలుంటాయి. అయితే, వచ్చే ఆదాయంలో ఎవరు ఎక్కువ ఇస్తే వారికి ఈ పనులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ 30.2 శాతం, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా 21.6 శాతం రెవెన్యూ షేర్‌ ఇవ్వటానికి ముందుకొచ్చాయి. అత్యధికంగా వాటా ఇచ్చేందుకు సిద్ధపడిన ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకే ఈ పనులు అప్పగించాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు